చిరంజీవి, బాల‌కృష్ణలే కార్తి టార్గెట్.. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్‌ను ఒకేసారి..

త‌మిళ హీరో కార్తికి తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు ఇక్క‌డ కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తాయి. ఆ మ‌ధ్య ఖాకీ సినిమాతో తెలుగులో కూడా సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు కార్తి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 27, 2019, 6:23 PM IST
చిరంజీవి, బాల‌కృష్ణలే కార్తి టార్గెట్.. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్‌ను ఒకేసారి..
కార్తి చిరంజీవి బాలయ్య ఫైల్ ఫోటోస్
  • Share this:
త‌మిళ హీరో కార్తికి తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు ఇక్క‌డ కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తాయి. ఆ మ‌ధ్య ఖాకీ సినిమాతో తెలుగులో కూడా సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు కార్తి. ఆ త‌ర్వాత కూడా వ‌ర‌స సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒకేసారి ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను క‌లిపి వాడేస్తున్నాడు ఈ అర‌వ హీరో. తెలుగు ఇండ‌స్ట్రీలో త‌మ‌కంటూ మాస్ ఫాలోయింగ్ భీభ‌త్సంగా సంపాదించుకున్న చిరంజీవి, బాల‌య్య ఇమేజ్‌ను ఇప్పుడు త‌న సినిమా కోసం వాడేసుకుంటున్నాడు కార్తి.

Karthi targeted Chiranjeevi, Balakrishna and using their old movie titles for his movies pk.. త‌మిళ హీరో కార్తికి తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు ఇక్క‌డ కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తాయి. ఆ మ‌ధ్య ఖాకీ సినిమాతో తెలుగులో కూడా సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు కార్తి. karthi,karthi twitter,karthi instagram,karthi facebook,karthi chiranjeevi title,karthi khaidi movie updates,karthi new movie,karthi next movie,karthi telugu movies,karthi khaidi first look,karthi lokesh kanagaraj movie updates,karthi next movie first look,karthi's next titled khaidi,karthi sutan movie,rashmika mandanna,karthi rashmika mandanna,rashmika mandanna songs,karthi rashmika,rashmika mandanna movies,karthi and rashmika mandanna movie,telugu cinema,కార్తి,కార్తి రష్మిక మందన్న,కార్తి ఖైదీ సినిమా ఫస్ట్ లుక్,కార్తి చిరంజీవి,కార్తి బాలకృష్ణ,కార్తి సుల్తాన్ సినిమా ఫస్ట్ లుక్,కార్తి లోకేష్ కనకరాజ్ సినిమా,తెలుగు సినిమా
కార్తి, చిరంజీవి ఖైదీ

వాళ్ల పాత టైటిల్స్ తన సినిమాకు పెట్టేసుకుంటున్నాడు ఈ హీరో. ఈ మ‌ధ్య కాలంలో చిరంజీవి టైటిల్స్ ఎక్కువ‌గా వాడుకుంటున్నారు హీరోలు. నాని గ్యాంగ్ లీడ‌ర్.. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో.. ఇప్పుడు కార్తి ఖైదీ అవుతున్నాడు. 35 ఏళ్ల కింద కోదండరామిరెడ్డి తెర‌కెక్కించిన ఈ చిత్రం చిరంజీవిని స్టార్ హీరోగా మార్చేసింది. ఇప్పుడు ఇదే టైటిల్ పెట్టుకుని ఓ ప్రయోగాత్మక సినిమాతో వ‌స్తున్నాడు కార్తి. ఈ సినిమా అంతా రాత్రి వేళలోనే న‌డుస్తుంది. ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నాడు. దీనిపై మంచి అంచ‌నాలున్నాయి.

Karthi targeted Chiranjeevi, Balakrishna and using their old movie titles for his movies pk.. త‌మిళ హీరో కార్తికి తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు ఇక్క‌డ కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తాయి. ఆ మ‌ధ్య ఖాకీ సినిమాతో తెలుగులో కూడా సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు కార్తి. karthi,karthi twitter,karthi instagram,karthi facebook,karthi chiranjeevi title,karthi khaidi movie updates,karthi new movie,karthi next movie,karthi telugu movies,karthi khaidi first look,karthi lokesh kanagaraj movie updates,karthi next movie first look,karthi's next titled khaidi,karthi sutan movie,rashmika mandanna,karthi rashmika mandanna,rashmika mandanna songs,karthi rashmika,rashmika mandanna movies,karthi and rashmika mandanna movie,telugu cinema,కార్తి,కార్తి రష్మిక మందన్న,కార్తి ఖైదీ సినిమా ఫస్ట్ లుక్,కార్తి చిరంజీవి,కార్తి బాలకృష్ణ,కార్తి సుల్తాన్ సినిమా ఫస్ట్ లుక్,కార్తి లోకేష్ కనకరాజ్ సినిమా,తెలుగు సినిమా
కార్తి బాలయ్య ఫైల్ ఫోటోస్

ఇక ఇప్పుడు మ‌రో సినిమా కోసం సుల్తాన్ అనే టైటిల్ వాడుకుంటున్నాడు కార్తి. ఇది బాల‌య్య టైటిల్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. 20 ఏళ్ల కింద బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ ఇది. ఇందులో బాల‌య్య ప్ర‌తినాయ‌క పాత్ర‌లో కూడా న‌టించాడు. ఇక ఇప్పుడు ఇదే టైటిల్ కార్తి, రష్మిక జంట‌గా రెమో ఫేమ్ భాగ్యరాజ ఖ‌న్నన్ తెర‌కెక్కిస్తున్న సినిమాకు ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తుంది. మొత్తానికి ఒకేసారి అటు చిరంజీవి, ఇటు బాల‌య్య టైటిల్స్ వాడుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగానే మాయ చేయ‌డానికి వ‌స్తున్నాడు ఈ హీరో.
First published: May 27, 2019, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading