Karthi Khaidi: కార్తి ‘ఖైదీ’ చిత్రానికి అరుదైన గౌరవం..

కార్తి తమిళంలో పాటు తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ఈయన హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రం తమిళంతో పాటు తెలుగులో సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం అరుదైన గౌరవం దక్కించుకుంది.

news18-telugu
Updated: August 2, 2020, 7:40 AM IST
Karthi Khaidi: కార్తి ‘ఖైదీ’ చిత్రానికి అరుదైన గౌరవం..
కార్తి ‘ఖైదీ’ మూవీ (File/Photo)
  • Share this:
కార్తి తమిళంలో పాటు తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ఈయన హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రం తమిళంతో పాటు తెలుగులో సంచలన విజయం సాధించింది. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథ, కథనం, లోకేష్ కనకరాజ్ టేకింగ్, కార్తి నటన వెరిసి ఈ సినిమా వెండితెరపై ఓ అద్భుతాన్నే క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఆగష్టు 9వ తేది న ుంచి 15 వరకు జరిగే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్‌‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఆగష్టు 12న ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్శిస్తారని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు ఈ  సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌తో పాటు నటీనటులకు  చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రస్తుతం ఈయన విజయ్ హీరోగా ‘మాస్టర్’ సినిమాను తెరకెక్కించాడు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.  మరోవైపు తెలుగు నుంచి టొరంటో చలన చిత్రోత్సవంలో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా ఎంపికైంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 2, 2020, 7:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading