బాక్సాఫీస్ దగ్గర కార్తి ‘ఖైదీ’ కుమ్ముడు మాములుగా లేదుగా..

ఈ దీపావళికి కార్తి హీరోగా నటించిన ‘ఖైదీ’ మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ‘ఖాకీ’ తర్వాత మరో పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో వచ్చిన కార్తికి ‘ఖైదీ’ సినిమాతో మరో హిట్టును అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 28, 2019, 4:11 PM IST
బాక్సాఫీస్ దగ్గర కార్తి ‘ఖైదీ’ కుమ్ముడు మాములుగా లేదుగా..
కార్తి ‘ఖైదీ’ సినిమా కలెక్షన్స్ (Twitter/Photo)
  • Share this:
ఈ దీపావళికి కార్తి హీరోగా నటించిన ‘ఖైదీ’ మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ‘ఖాకీ’ తర్వాత మరో పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో వచ్చిన కార్తికి ‘ఖైదీ’ సినిమాతో మరో హిట్టును అందుకున్నాడు. ఈ సినిమా కేవలం తమిళనాడులో కాకుండా తెలుగు, మలయాళ భాషలతో పాటు ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం కార్తీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన సినిమాగా రికార్డును క్రియేట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ‘ఖైదీ’ చిత్రం ఒక పక్క విజయ్ ‘బిగిల్’ చిత్రంతో పోటీని తట్టుకొని మరీ రికార్డుల వసూళ్లను రాబడుతోంది. కేవలం చెన్నైలోనే ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.కోటి 7లక్షలు వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కేరళలో ఈ సినిమా మొదటిరోజే.. రూ.45 లక్షలు, శనివారం రూ.50 లక్షలు, ఆదివారం రూ.61 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే..రూ.1.56 కోట్ల గ్రాస్ వసూళ్లు..రూ.71 లక్షల షేర్‌ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేరళ రైట్స్ రూ.60 లక్షలకు అమ్ముడుపోయింది. ఇప్పటికే అక్కడ ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో  ఇంకెన్ని కలెక్షన్స్ నమోదు చేస్తుందో చూడాలి.karthi khaidi movie 3 days world wide collections,karthi,karthi khaidi,khaidi movie review,karthi khaidi first day world wide collections,khaidi 3days collections,khaidi collections,karthi khaidi movie,karthi khaidi review,karthi khaidi movie review,khaidi movie review,khaidi movie,khaidi,kaithi karthi movie,karthi khaidi public talk,kaithi 1st day collection,kaithi box office collection,kaithi,kaithi first day collection,khaidi public talk,khaidi review,kaithi tamil movie,kaithi collection,karthi khaidi pre release event live,kaithi review,kaithi movie collection,tollywood,telugu cinema,కార్తి,ఖైదీ మూవీ రివ్యూ,ఖైదీ కలెక్షన్స్,ఖైదీ 3 రోజుల కలెక్షన్స్,ఖైదీ కలెక్షన్స్,ఖైదీ వాల్డ్ వైడ్ కలెక్షన్స్
కార్తి ‘ఖైదీ’ సినిమా పోస్టర్ (Twitter/Photo)తెలుగులో ఈ సినిమా శుక్ర, శనివారాల్లోనే రూ.కోటి పైగా కలెక్షన్స్ కొల్లగొట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు రూ. 50లక్షల షేర్ సాధించగా.. రెండో రోజు రూ.68లక్షలను రాబట్టింది. ఆదివారం రూ.1.50 కోటి పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా రూ.2.5 కోట్ల షేర్ వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. ఈ వీక్ కూడా ఇదే ఫ్లో కంటిన్యూ అయితే.. ‘ఖైదీ’ తెలుగులో లాభాల్లోకి రావడం ఖాయం అని చెప్పొచ్చు. మొత్తంగా తెలుగు, తమిళం మిగతా భాషల్లో కలిపి రూ.14 కోట్లు పైగా వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. 


Published by: Kiran Kumar Thanjavur
First published: October 28, 2019, 4:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading