కార్తి ‘ఖైదీ’ టీజ‌ర్ విడుద‌ల‌.. అంతా ఆ రాత్రిలోనే జ‌రిగిపోయింది..

దేవ్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత కార్తి న‌టిస్తున్న సినిమా ఖైదీ. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ త‌న సినిమా కోసం వాడేసుకుంటున్నాడు ఈ హీరో. రిస్క్ అని తెలిసినా కూడా ఆ క‌థ‌కు ప‌ర్ఫెక్ట్ టైటిల్ అదే అని ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా భావిస్తుండ‌టంతో ఖైదీకే ఫిక్స్ అయిపోయారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 30, 2019, 7:49 PM IST
కార్తి ‘ఖైదీ’ టీజ‌ర్ విడుద‌ల‌.. అంతా ఆ రాత్రిలోనే జ‌రిగిపోయింది..
కార్తి ఖైదీ పోస్టర్
  • Share this:
దేవ్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత కార్తి న‌టిస్తున్న సినిమా ఖైదీ. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ త‌న సినిమా కోసం వాడేసుకుంటున్నాడు ఈ హీరో. రిస్క్ అని తెలిసినా కూడా ఆ క‌థ‌కు ప‌ర్ఫెక్ట్ టైటిల్ అదే అని ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా భావిస్తుండ‌టంతో ఖైదీకే ఫిక్స్ అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఈ సినిమా క‌థ అంతా రాత్రిలోనే జ‌రుగుతుండ‌టం విశేషం. టీజ‌ర్ కూడా మొత్తం నైట్ విజువ‌ల్స్‌తోనే నిండిపోయింది. కార్తి లుక్ కూడా అదిరిపోవ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి.

ఓ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు కార్తి. ప‌క్కా మాస్ పాత్ర‌లో మ‌రోసారి ఇమిడిపోయాడు ఈ హీరో. డీ గ్లామ‌రైజ్డ్‌గా ఉన్న ఈ పాత్ర‌కు ప్రాణం పోసాడు కార్తి. ముఖ్యంగా టీజర్ చివ‌ర్లో చికెన్ తింటూ కార్తి ఇచ్చిన పోజు కేక పెట్టిస్తుంది. లోకేష్ క‌న‌క‌రాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో క‌చ్చితంగా మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌స్తానంటున్నాడు కార్తి. మ‌రి ఈయ‌న కోరిక ఎంత‌వ‌రకు ఖైదీ సినిమా తీరుస్తుందో చూడాలి.

First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు