కార్తి ‘దొంగ’ ట్రైలర్ రిలీజ్.. మరోసారి చించేశాడుగా..

Karti Donga : కార్తి తమిళంలో నటించిన తంబి సినిమాను తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల చేస్తున్నారు. అయితే.. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఈ రోజు సినీ నిర్వాహకులు విడుదల చేశారు.

news18-telugu
Updated: December 10, 2019, 7:04 PM IST
కార్తి ‘దొంగ’ ట్రైలర్ రిలీజ్.. మరోసారి చించేశాడుగా..
‘కార్తి’ దొంగ ట్రైలర్ (Twitter/Photo)
  • Share this:
‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తి.. దొంగ సినిమాతో పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మలయాళ దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వయాకామ్18 సమర్పిస్తోంది. నిజ జీవితంలో వదిన, మరిది అయిన జ్యోతిక,కార్తి ఈ సినిమాలో అక్కా తమ్ముళ్ల పాత్రలో నటించారు. తమిళంలో ‘తంబి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల చేస్తున్నారు. అయితే.. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఈ రోజు సినీ నిర్వాహకులు విడుదల చేశారు. సెంటిమెంట్, ఫైట్స్, లవ్.. అన్ని సమపాళ్లలో కలిగిన సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో ‘అక్క ఉంటే.. ఇద్దరు అమ్మలతో సమానం’ అన్న డైలాగ్ కిరాక్ పుట్టించింది.First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు