కార్తి ‘దొంగ’ ట్రైలర్ రిలీజ్.. మరోసారి చించేశాడుగా..

Karti Donga : కార్తి తమిళంలో నటించిన తంబి సినిమాను తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల చేస్తున్నారు. అయితే.. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఈ రోజు సినీ నిర్వాహకులు విడుదల చేశారు.

news18-telugu
Updated: December 10, 2019, 7:04 PM IST
కార్తి ‘దొంగ’ ట్రైలర్ రిలీజ్.. మరోసారి చించేశాడుగా..
‘కార్తి’ దొంగ ట్రైలర్ (Twitter/Photo)
  • Share this:
‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తి.. దొంగ సినిమాతో పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మలయాళ దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వయాకామ్18 సమర్పిస్తోంది. నిజ జీవితంలో వదిన, మరిది అయిన జ్యోతిక,కార్తి ఈ సినిమాలో అక్కా తమ్ముళ్ల పాత్రలో నటించారు. తమిళంలో ‘తంబి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల చేస్తున్నారు. అయితే.. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఈ రోజు సినీ నిర్వాహకులు విడుదల చేశారు. సెంటిమెంట్, ఫైట్స్, లవ్.. అన్ని సమపాళ్లలో కలిగిన సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో ‘అక్క ఉంటే.. ఇద్దరు అమ్మలతో సమానం’ అన్న డైలాగ్ కిరాక్ పుట్టించింది.



First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>