రివ్యూ: దొంగ.. ‘దృశ్యం’ లాంటి సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామా..

పేరుకు తమిళ నటుడే కానీ కార్తికి తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఖైదీతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో దొంగపై భారీ అంచనాలున్నాయి. దానికితోడు దృశ్యం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 20, 2019, 7:15 PM IST
రివ్యూ: దొంగ.. ‘దృశ్యం’ లాంటి సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామా..
ఈ ఏడాది కార్తి నుంచి వచ్చిన మూడో సినిమా దొంగ. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా కూడా స్లో నెరేషన్‌తో కలెక్షన్స్ వేటలో వెనకబడిపోయింది. జ్యోతిక ఈ చిత్రంలో కార్తికి అక్కగా నటించింది.
  • Share this:
నటీనటులు: కార్తీ, జ్యోతిక, నిఖిలా విమల్, సత్యరాజ్, సీత, షావుకారు జానకి తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: ఆర్‌డీ రాజశేఖర్

నిర్మాతలు: వియాకమ్ 18 మోషన్ పిక్చర్స్, సూరజ్ సాధన
దర్శకత్వం: జీతూ జోసెఫ్పేరుకు తమిళ నటుడే కానీ కార్తికి తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఖైదీతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో దొంగపై భారీ అంచనాలున్నాయి. దానికితోడు దృశ్యం లాంటి సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకుడు కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి ఈ చిత్రంతో కార్తి ఎంతవరకు ఆకట్టుకున్నాడు..?

కథ:రాజకీయాల్లో బిజీగా ఉండే లీడర్ ఙ్ఞానమూర్తి(సత్య రాజ్). అక్కడే ఉండి ప్రజల మంచి చెడులు చూస్తుంటాడు. ఆయనకు ఓ కొడుకు ఉంటాడు. అతడి పేరు శర్వా. చిన్నపుడే ఇంట్లోంచి తప్పిపోతాడు. 15 ఏళ్లుగా కొడుకు కోసం వెతికినా కూడా లాభం ఉండదు. ఇక శర్వాకు ఓ అక్క పార్వతి (జ్యోతిక) ఉంటుంది. తమ్ముడు అంటే ప్రాణం. అదే సమయంలో తప్పిపోయిన శర్వా గురించి తెలుసుకుని.. అతడు గోవాలో ఉన్నాడంటూ అక్కడి పోలీస్ ఆఫీసర్ జ్ఞానమూర్తికి చెప్తాడు. అప్పటికే అక్కడ విక్కీ (కార్తీ) దొంగతనాలు చేస్తుంటాడు. అలాంటి సమయంలో శర్వాగా ఆ ఇంట్లోకి వెళ్తాడు.. అక్కడ అందర్నీ నమ్మిస్తుంటాడు. కానీ అదే సమయంలో శర్వా తనను తాను అక్కడ నిరూపించుకోడానికి చాలా ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాడు..? అసలు శర్వా ఎందుకు ఇంట్లోంచి పారిపోయాడు.. అక్కడ్నుంచి అసలు కథ ఏంటి అనేది మిగిలిన స్టోరీ..

కథనం:
జీతూ జోసెఫ్ నేరుగా తెలుగు ఆడియన్స్‌కు తెలియకపోవచ్చు కానీ ఆయన చేసిన దృశ్యం ఇక్కడ కూడా సంచలనమే. ఈ సినిమా తెలుగులో కూడా విజయం సాధించడంతో దృశ్యం దర్శకుడు అంటూ జోసెఫ్‌కు ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే క్రేజ్ వాడుకుంటూ దొంగ సినిమాను తెలుగులో విడుదల చేసారు. దానికితోడు కార్తి ఎలాగూ ఉన్నాడు. మరోసారి దృశ్యం మాదిరే సస్పెన్స్‌తో సాగే ఫ్యామిలీ డ్రామానే రాసుకున్నాడు ఈ దర్శకుడు. దానికి కార్తి లాంటి యాక్టర్ తోడయ్యేసరికి చాలా వరకు సక్సెస్ అయింది కథ. ఫస్టాఫ్ అంతా కాస్త సోసోగా సాగినా కూడా వినోదాత్మకంగా కథనం రాసుకున్నాడు జీతూ. ముఖ్యంగా పిల్లాడితో కార్తి చేసే కామెడీ బాగుంది. అలాగే షావుకారు జానకితో వచ్చే సీక్వెన్స్.. జ్యోతిక, కార్తి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. దానికితోడు సెకడాంఫ్‌లో కథనం మరింత వేగం పుంజుకుంటుంది. కానీ కథ అప్పటికే తెలిసిపోవడంతో కాస్త ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ ట్విస్ట్‌తో సినిమా రేంజ్ మార్చేసాడు దర్శకుడు. ముందు నుంచి వస్తున్న ప్రోమోలు, ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమా అంతా అక్కా తమ్ముళ్ల మధ్యే సాగుతుందనే భ్రమలో ఉంటాం కానీ అసలు జ్యోతిక పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో అభిమానులకు కాస్త నిరాశ తప్పదు. అయినా సినిమాలో ప్రధానమైన సన్నివేశాలన్నీ ఈమె చుట్టూనే అల్లుకున్నాడు దర్శకుడు. చివరికి క్లైమాక్స్ ట్విస్ట్ కూడా. అప్పటి వరకు ఉన్న సస్పెన్స్ డ్రామా కాస్తా క్లైమాక్స్‌తో ఎమోషనల్ అవుతుంది.

నటీనటులు:
ఈ సినిమాకు ప్రధాన హైలైట్ కార్తి. అసలు మనోడి నటనకు ఫిదా కానీ వాళ్లంటూ ఉండరు. కామెడీ.. యాక్షన్.. డ్రామా.. ఎమోషన్ అన్నింట్లోనూ అదరగొట్టాడు. జ్యోతికతో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. ఇక జ్యోతిక కూడా కార్తితో పోటీపడి నటించింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాకు హైలైట్. సత్యరాజ్‌కు సినిమాలో భిన్నమైన కోణాల్లో నటన ప్రదర్శించే అవకాశం దొరికింది. ఓ సారి పాజిటివ్.. మరోసారి నెగిటివ్.. ఇలా చాలా కోణాలున్నాయి ఈ కారెక్టర్‌‌లో. హీరోయిన్ నిఖిలా విమల్‌కు పెద్దగా స్కోప్ లేదు. 15 ఏళ్ళ తర్వాత వచ్చిన ప్రియుడి కోసం తపించే అమ్మాయిగా నటించింది అంతే. కన్నింగ్ పోలీస్ అధికారిగా ఇళవరసి.. జ్యోతిక ట్యూషన్ స్టూడెంట్‌గా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:
గోవింద వసంత్ అందించిన మ్యూజిక్ బాగుంది. పాటల సంగతి పక్కనబెడితే ఆర్ఆర్ అదిరిపోయింది. సినిమాటోగ్రాఫర్ ఆర్డీ రాజశేఖర్ కెమెరా పనితనం బాగుంది. అడవుల అందాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ పర్లేదు. దర్శకుడిగా జీతూ జోసెఫ్ మరోసారి దృశ్యం దారిలోనే వెళ్లినట్లు అనిపిస్తుంది. అప్పటంత మాయ చేయకపోయినా కూడా చాలా వరకు కవర్ చేసాడు. క్లైమాక్స్ ట్విస్ట్‌తో సినిమా స్వరూపం మారిపోయింది.

చివరగా ఒక్కమాట:
దొంగ.. సస్పెన్స్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా..

రేటింగ్: 3/5
First published: December 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు