రేపే కార్తి ‘దొంగ’ ఆడియో.. ముఖ్య అతిథిగా టాలీవుడ్ అగ్ర హీరో..

ఈయేడాది ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తి.. నెక్ట్స్ ‘దొంగ’ సినిమాతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ఆడియో రేపు (డిసెంబర్ 30)న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

news18-telugu
Updated: November 29, 2019, 1:12 PM IST
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో.. ముఖ్య అతిథిగా టాలీవుడ్ అగ్ర హీరో..
‘కార్తి’ దొంగ ట్రైలర్ (Twitter/Photo)
  • Share this:
ఈయేడాది ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తి.. నెక్ట్స్ ‘దొంగ’ సినిమాతో పలకరించబోతున్నాడు. మలయాళ దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. నిజ జీవితంలో వదినా మరది అయిన జ్యోతిక,కార్తిలు ఈ సినిమాలో అక్కా తమ్ముళ్ల పాత్రలో నటించారు. తమిళంలో ‘తంబి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఆడియో రేపు (డిసెంబర్ 30)న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాను వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమాను డిసెంబర్‌లో మంచి తేది చూసుకొని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. .

 

First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు