కార్తి ‘దేవ్’ టీజర్ టాక్

‘చిన‌బాబు’ త‌మిళ్ వ‌ర్ష‌న్ విజ‌యంతో కార్తి జోరు మీదున్నాడు. ఈ మూవీ తర్వాత ‘దేవ్’ సినిమా చేస్తున్నాడు. రజత్ రవిశంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఆల్మొస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: November 5, 2018, 3:10 PM IST
కార్తి ‘దేవ్’ టీజర్ టాక్
కార్తి దేవ్
news18-telugu
Updated: November 5, 2018, 3:10 PM IST
‘చిన‌బాబు’ త‌మిళ్ వ‌ర్ష‌న్ విజ‌యంతో కార్తి జోరు మీదున్నాడు. ఈ మూవీ తర్వాత ‘దేవ్’ సినిమా చేస్తున్నాడు. రజత్ రవిశంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఆల్మొస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఖాకీ’ తర్వాత మరోసారి ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్‌తో జోడి కట్టాడు. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసారు.

‘ఖాకీ’లో పోలీస్ పాత్రలో ఇరగదీసిన కార్తి...ఆ తర్వాత ‘చినబాబు’ సినిమాలో రైతు క్యారెక్టర్‌లో వేరియేషన్ చూపించాడు. ఇపుడు ‘దేవ్’ గా మరోసారి తన పాత్రలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ లోకంలో బతకడానికి ఎన్నో దారులున్నాయి. ఎవరో చెప్పారని అర్థంగాని చదువు చదివి..ఇష్టం లేని ఉద్యోగం చేసి..ముక్కు మొహం తెలియని నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పనిచేసి..ఈగో,ప్రెషర్..కాంపిటీషన్‌ అంటూ కార్తి చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి.ఈ మూవీలో కార్తి రేసర్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు.

First published: November 5, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...