నాగార్జున నోట కార్తీకదీపం మాట...Bigg Boss 4కు వంటలక్కను క్రాస్‌ చేసే దమ్ముందా...

బిగ్ బాస్ సీజన్ 4 ముందు అతిపెద్ద టాస్క్ ఉంది. అదేంటంటే...కార్తీక దీపం రేటింగ్స్ ను దాటాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కార్తీక దీపం సీరియల్ లాక్ డౌన్ సమయంలో మినాహా గత రెండేళ్లుగా టాప్ సీరియల్ గా కొనసాగుతోంది.

news18-telugu
Updated: September 6, 2020, 6:39 PM IST
నాగార్జున నోట కార్తీకదీపం మాట...Bigg Boss 4కు వంటలక్కను క్రాస్‌ చేసే దమ్ముందా...
బిగ్ బాస్ సీజన్ 4 ముందు అతిపెద్ద టాస్క్ ఉంది. అదేంటంటే...కార్తీక దీపం రేటింగ్స్ ను దాటాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కార్తీక దీపం సీరియల్ లాక్ డౌన్ సమయంలో మినాహా గత రెండేళ్లుగా టాప్ సీరియల్ గా కొనసాగుతోంది.
  • Share this:
తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పవచ్చు. ఈ సీరియల్ దెబ్బతో మిగితా చానెల్స్ వారికి పోటీ పెరిగిందంటే అతిశయోక్తి కాదు. సినిమా హీరోలను మించి అభిమానం ఈ సీరియల్ కేరక్టర్లకు ఉంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కార్తీకదీపం సీరియల్‌ను పురుషుల్లో సైతం పెద్ద ఎత్తున అభిమానులున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ సీరియల్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రపంచ కప్ లాంటి ఈవెంట్లను సైతం పక్కన పెట్టేసి మహిళా ప్రేక్షకులు ఇంట్లో టీవీ రిమోట్ కంట్రోళ్లను దాచేసి మరీ సీరియల్ ఫాలో అవుతుంటారు. మరి ఇంతలా ఆకట్టుకున్న ఈ సీరియల్‌కు అంత పేరు తెచ్చింది మాత్రం దీప అలియాస్ వంటలక్క కేరక్టర్ అనే చెప్పవచ్చు. దీప, కార్తీక్ మధ్య ఉన్న దాంపత్య బంధమే ఈ సీరియల్ సక్సెస్ అని చెబుతుంటారు. అలాగే వంటలక్క కేరక్టర్ లో ఒదిగిపోయిన ప్రేమి విశ్వనాథ్ పెద్దగా గ్లామరస్ కాకపోయినప్పటికీ ఆమెకు మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.

అయితే తాజాగా బిగ్ బాస్ 4వ సీజన్ ఓపెనింగ్ లో హోస్ట్ నాగార్జున ప్రత్యేకంగా కార్తీక దీపం సీరియల్ గురించి ప్రస్తావన తెచ్చారు. అంతేకాదు మా టీవీలో తరచూ ప్రసారం అయ్యే బాహుబలి సినిమాతో కార్తీక దీపం సీరియల్ ను పోల్చారు. అయితే తాజాగా ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 4 ముందు అతిపెద్ద టాస్క్ ఉంది. అదేంటంటే...కార్తీక దీపం రేటింగ్స్ ను దాటాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కార్తీక దీపం సీరియల్ లాక్ డౌన్ సమయంలో మినాహా గత రెండేళ్లుగా టాప్ సీరియల్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం కూడా తెలుగులో నెంబర్ వన్ ప్రోగ్రాముగా అన్ని సినిమాలను, సీరియల్స్ ను తోసి రాజని ఫస్ట్ స్థాయిలో నిలిచింది. అయితే గతంలో బిగ్ బాస్ 3 సీజన్లు కూడా వంటలక్క కార్తీక దీపం క్రియేట్ చేసిన మ్యాజిక్ ను టచ్ చేయలేకపయాయి. ఇక గత ఏడాది సీజన్ లో బిగ్ బాస్ ఫైనల్స్ లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కలిసి వచ్చినా కూడా కార్తీక దీపం సీరియల్ ను కనీసం టచ్ చేయలేకపోయారు. అయితే కనీసం ఈ ఏడాది అయిన కార్తీక దీపం కింద సెకండ్ పోజిషన్ తెచ్చుకున్నా అది చాలా పెద్ద సక్సెస్ యే అని నెటిజన్లు భావిస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: September 6, 2020, 6:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading