హోమ్ /వార్తలు /సినిమా /

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం కర్ణాటక ప్రభుత్వం అత్యుత్తమ పురస్కారం..

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం కర్ణాటక ప్రభుత్వం అత్యుత్తమ పురస్కారం..

స్పాట్ డబ్బింగ్ ఓ సారి ఇప్పటికే చెక్ చేసి కూడా చూసారు. కొన్ని సీన్స్ వరకు ఓకే అనిపించినా.. మరికొన్ని మాత్రం అస్సలు సెట్ కావడం లేదని తెలుస్తుంది. అందుకే శివరాజ్ కుమార్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం దాదాపు ఖాయం అయిపోయింది. శివన్న కూడా పునీత్ చివరి సినిమా కోసం చాలా ఏర్పాట్లు చేస్తున్నాడు. తమ్ముడి సినిమాను గ్రాండ్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. జేమ్స్ సినిమాను 2022 మార్చ్ 17.. పునీత్ రాజ్‌కుమార్ జయంతి రోజు విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

స్పాట్ డబ్బింగ్ ఓ సారి ఇప్పటికే చెక్ చేసి కూడా చూసారు. కొన్ని సీన్స్ వరకు ఓకే అనిపించినా.. మరికొన్ని మాత్రం అస్సలు సెట్ కావడం లేదని తెలుస్తుంది. అందుకే శివరాజ్ కుమార్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం దాదాపు ఖాయం అయిపోయింది. శివన్న కూడా పునీత్ చివరి సినిమా కోసం చాలా ఏర్పాట్లు చేస్తున్నాడు. తమ్ముడి సినిమాను గ్రాండ్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. జేమ్స్ సినిమాను 2022 మార్చ్ 17.. పునీత్ రాజ్‌కుమార్ జయంతి రోజు విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Puneeth Rajkumar: ఎన్నేళ్లు బతికామన్నది కాదు.. ఉన్నపుడు ఎంతమందిని సంతోషపెట్టామనేది ముఖ్యం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) అందరికంటే ముందున్నారు. కేవలం 46 సంవత్సరాల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించినా కూడా.. అతడి కోసం 16 మంది గుండెలు ఆగిపోయాయి.

ఇంకా చదవండి ...

ఎన్ని సంవత్సరాలు బతికామన్నది కాదు.. బ్రతికినన్నాళ్లు ఎంత మందిని మనం సంతోషపెట్టాం.. ఎంతమంది ఆప్తులను సంపాదించుకున్నామనేది ముఖ్యం. ఈ విషయంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అందరికంటే ముందున్నారు. కేవలం 46 సంవత్సరాల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించినా కూడా.. అతడి కోసం 16 మంది గుండెలు ఆగిపోయాయి. పవర్ స్టార్ చనిపోయి 10 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కర్ణాటకలో ఆయన నామస్మరణ జరుగుతుంది. రోజుకు లక్షలాది మంది పునీత్ రాజ్‌కుమార్ సమాధి దగ్గరికి వచ్చి దర్శించుకుంటున్నారు. అలాగే కొన్ని ప్రేమ జంటలు కూడా ఆయన సమాధి దగ్గర పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు అంటే కర్ణాటకలో పునీత్ పేరు ప్రఖ్యాతులు ఎంతగా ఎదిగిపోయాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సినిమా హీరోగానే కాకుండా ఆయన చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు ఈ రోజు ప్రజల గుండెల్లో పునీత్‌ను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి.

ముఖ్యంగా తను ఉన్నా లేకపోయినా సేవా కార్యక్రమాలు ఆగకూడదు అనే ఉద్ధేశ్యంతో కొన్నేళ్ల కిందే తన ఛారిటీ ట్రస్టులో 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఆయన. ఇది తెలిసిన తర్వాత పునీత్‌పై అభిమానం 100 రెట్లు పెరిగింది. ఇలాంటి మంచి మనిషిని ఆ దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు కన్నడిగులు. ఇదిలా ఉంటే ఆయన మరణానంతరం కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక అత్యుత్తమ పురస్కారం పునీత్ రాజ్‌కుమార్‌కు అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Jai Bhim - Lijomol Jose: సూర్య ‘జై భీమ్‌’లో సినతల్లి పాత్ర పోషించిన ఈ హీరోయిన్ బ్యాగ్రౌండ్ మీకు తెలుసా..?


Sooryavanshi Collections: ‘సూర్యవంశీ’ రికార్డ్ కలెక్షన్స్.. ఖిలాడీ దెబ్బకు షేక్ అవుతున్న బాలీవుడ్ బాక్సాఫీస్..


కేవలం కన్నడిగులకు మాత్రమే ఇచ్చే పురస్కారం అది. అత్యుత్తమ సేవా కార్యక్రమాలతో పాటు అభిమానం పొందిన అతి కొద్దిమందికి ఇచ్చే ఆ పురస్కారమే బసవ శ్రీ. కర్ణాటకలో ఎక్కువ మంది ప్రజలు బసవేశ్వరుడిని పూజిస్తారు. ఆయన పేరు మీద బసవ శ్రీ పురస్కారం ఇస్తుంటారు. ఇప్పుడు ఈ అత్యుత్తమ పురస్కారం దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది.

Roja missing in Jabardasth: జబర్దస్త్‌లో రోజా ఔట్.. ఇంద్రజ ఇన్.. తెరవెనక ఏం జరుగుతుంది..?


ఈ పురస్కారంతో పాటు పునీత్ రాజ్‌కుమార్ చేసిన సేవలను గుర్తించి అతనికి కర్ణాటక రత్న బిరుదు కూడా ఇవ్వాలని అభిమానులు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. దీనిపై కూడా ఆలోచిస్తామని ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇంత మంది గుండెల్లో బ్రతికి ఉండటం అనేది చిన్న విషయం కాదు. కానీ అది చేసి చూపించాడు కన్నడ పవర్ స్టార్. ఆయన చేసిన గొప్ప పనులు చూసిన తర్వాత అతని ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థించడం తప్ప ఇంకేమి చేయలేకపోతున్నారు అభిమానులు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kannada Cinema, Puneeth RajKumar

ఉత్తమ కథలు