కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి తనయుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం..

నిఖిల్ గౌడ రేవతి నిశ్చితార్థం (nikhil gowda revathi engagement)

Nikhil Gowda Engagement: కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి తనయుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం బెంగళూరులో ఘనంగా జరిగింది. దీనికి పార్టీ నేతలతో పాటు నిఖిల్ అభిమానులు కూడా భారీగానే హాజరయ్యారు.

  • Share this:
కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి తనయుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం బెంగళూరులో ఘనంగా జరిగింది. దీనికి పార్టీ నేతలతో పాటు నిఖిల్ అభిమానులు కూడా భారీగానే హాజరయ్యారు. బెంగళూరులోని తాజ్‌ వెస్టెండ్‌ హోటల్లో ఈ నిశ్చితార్థం అత్యంత ఘనంగా జరిగింది. రేవతితో నిఖిల్ గౌడ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుక గురించి ముందుగానే కుమారస్వామి బెంగళూరులో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు ఒకరోజు ముందు నుంచే జరుగుతున్నాయి.. పూర్తి చేసారు కూడా. ఈ వేడుకకు అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 4 నుంచి 5 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు.
నిఖిల్ గౌడ రేవతి నిశ్చితార్థం (nikhil gowda revathi engagement)
నిఖిల్ గౌడ రేవతి నిశ్చితార్థం (nikhil gowda revathi engagement)

అందరి మధ్య నిఖిల్‌, రేవతి నిశ్చితార్థ వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ పెళ్ళిని కూడా కనివిని ఎరుగని స్థాయిలో జరిపించాలని ప్లాన్ చేస్తున్నారు కుమార స్వామి. తెలుగులో కూడా నిఖిల్ గౌడ పరిచయమే. ఈయన నాలుగేళ్ల కింద జాగ్వార్‌ సినిమాతో ఇక్కడ ఆడియన్స్‌కు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో కూడా బిజీ అయ్యాడు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయాల్లోనూ మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్‌ చేతితో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు నిఖిల్ గౌడ. ఇప్పుడు పెళ్లితో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published: