KARNATAKA EX CM KUMARASWAMY WIFE RADHIKA CHEATED BY ONE OF THE YOUTUBE CHANNEL HERE ARE THE DETAILS TA
Radhika Kumaraswamy: మోసపోయిన మాజీ సీఎం భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్..
మోసపోయిన మాజీ సీఎం భార్య రాధిక కుమారస్వామి (File/Photo)
Radhika Kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సతీమణి రాధికా కుమారస్వామి హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆమె మోసపోయినట్టు బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Radhika Kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సతీమణి రాధికా కుమారస్వామి హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే కదా. కుట్టి రాధికగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాధికా కుమార స్వామి తొలి సినిమా నుంచే సంచలనాలకు తెరలేపారు. అయితే కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలోనే ఆమె కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రహస్య వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. దాంతో పాటు ఆమె ప్రధాన పాత్రలో కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే ఉంది. పెళ్లైన తర్వా రాధిక కుమారస్వామిగా ఆమె ప్రాచుర్యంలోకి వచ్చింది. తాజాగా ఈమెకు ఓ యూట్యూబ్ ఛానెల్ భారీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆమె నటించిన ఓ చిత్రాన్ని ఆమె పర్మిషన్ లేకుండా సదురు మూవీని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న రాధిక కుమారస్వామి సదురు యూట్యూబ్ ఛానెల్‌పై లీగల్‌గానే చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించింది.
భర్త కుమారస్వామి, కూతురుతో రాధిక కుమారస్వామి (Twitter/Photo)
2013లో రాధిక కుమారస్వామి ‘స్వీటీ నాన్న జోడి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం థియేటర్లో విడులైంది. ఐతే.. ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. కానీ డిజిటల్ హక్కులు మాత్రం రాధిక కుమార స్వామి దగ్గరే ఉన్నాయట. రూ. 3 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ చిత్రాన్నిఆమె అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడాన్ని ఇపుడు ఆమె దృష్టిలోకి వచ్చింది. రూ. 3 కోట్ల పెట్టుబడితో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తన అనుమతి లేకుండా యూట్యూబ్‌లో రిలీజ్ చేయడం నిజంగానే అక్రమం. ఇది ఛీటింగ్ కిందికే వస్తోంది. ఈ విషయమైన ఆమె బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి మమల్ని సదరు యూట్యూబ్ ఛానెల్ తమను చీటింగ్ చేశారని తన కంప్లైంట్లో పేర్కొంది. ఈ కేసు విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అర్జున్ సినిమాలో నటిస్తోన్న రాధిక కుమారస్వామి (Twitter/Photo)
స్వీటీ జోడి నాన్న విషయానికొస్తే.. ఈ సినిమాను రాధిక కుమారస్వామి ఐదేళ్ల తర్వాత హీరోయిన్గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆదిత్య హీరోగా నటించారు. ప్రస్తుతం రాధిక కుమారస్వామి అర్జున్ హీరోగా నటించిన ‘కాంట్రాక్ట్ అనే చిత్రంలో నటించారు. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘బైరాదేవి’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.