సినిమా చూసి సీఎం కంటతడి పెట్టుకున్నారు. కన్నీళ్లు ఆపుకోలేక తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సీఎం మరి ఎవరో కాదు.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై. ఆయన తాజాగా 777 చార్లీ చిత్రం చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీరు ఆపుకోలేకపోయారు. ఆ సినిమా చూసి బసవరాజు బొమ్మై గతంలో మరణించిన తన పెట్ డాగ్ ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.
సీఎం బసవరాజు ఇంట్లో చాలా కాలంగా ఓ పెట్ డాగ్ ఉండేది. దానితో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అనారోగ్యంతో ఆ డాగ్ చనిపోవడంతో సీఎం బసవరాజు చాలా కృంగిపోయారట. తాాజాగా 777 చార్లీ సినిమా చూశాక తనకు దూరమైన పెట్ డాగ్ ని తలచుకొని ఆయన ఏడ్చారు.
కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా 777 చార్లీ తెరకెక్కింది. చార్లీ అనే డాగ్ ఓ మనిషి జీవితాన్ని ఎలా మార్చింది అనేది ఆ సినిమా కథ. జూన్ 10న కన్నడ, తెలుగు భాషల్లో 777 చార్లీ విడుదల చేశారు. దర్శకుడు కిరణ్ రాజ్ కే తెరకెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. కన్నడలో 777 చార్లీ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమా ముఖ్యంగా పెట్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది.
The honorable Chief Minister of Karnataka, Shri. Basavaraja Bommai garu, teared up at the #777Charlie screening ❤️@rakshitshetty @ranadaggubati @Kiranraj61 @nobinpaul @RajbShettyOMK @sangeethaSring @pratheek_dbf @ParamvahStudios pic.twitter.com/0TBIcG31Eh
— Suresh Productions (@SureshProdns) June 14, 2022
cm
మరోవైపు జబర్దస్త్ యాంకర్ రష్మీ… 777 చార్లీ మూవీ అందరూ చూడాలంటూ పిలుపునిచ్చారు. మూగజీవాల ప్రాముఖ్యత, వాటి ప్రేమను తెలియజేసే ఈ మూవీని అందరూ ఆదరించాలని సోషల్ మీడియా వేదికగా ఆమె కోరారు. రష్మీకి కూడా పెట్స్ అంటే చాలా ప్రేమ.. మూగజీవాల సంక్షేమం కోసం ఆమె కూడా ఎప్పుడూ ముందుంటారు. ఇక ఏ చిన్న జంతువును హింసించినా రష్మీ ఎమోషనల్ అయిపోయి... వారిపై మండిపడుతుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautham, Basavaraj Bommai, Karnataka, Rakshit Shetty