ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కన్నడ చిత్రసీమ (sandalwood) నుంచి మరో ఆసక్తికర సినిమా వస్తోంది. శాండల్ వుడ్ మొట్ట మొదటి బయోపిక్.. విజయానంద్ (Vijayanand).. పాన్ ఇండియా మూవీగా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రయలర్ రిలీజ్ కార్యక్రమం ఇవాళ సాయంత్రం బెంగళూరు (Bengaluru)లో గ్రాండ్‌గా జరిగింది. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) విజయనాంద్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Honourable Chief Minister of Karnataka, Shri. @BSBommai launched the trailer of #Vijayanand, which is based on the life of eminent industrialist #VijaySankeshwar, in the presence of National Media at the Orion Mall in Bangalore.https://t.co/IyYUEySC6G#VijayanandTrailerLaunch pic.twitter.com/ZfdjCe5xo8
— BA Raju's Team (@baraju_SuperHit) November 19, 2022
వీఆర్ఎల్ లాజిస్టిక్స్ కంపెనీ ఛైర్మన్ విజయ్ సంకేశ్వర్ బయోపిక్ ఇది. వీఆర్ఎల్ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆనంద్ సంకేశ్వర్.. 'విజయానంద్' సినిమాను నిర్మించారు. విజయ్ సంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటించారు. రిషిక శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ గోపి శంకర్ సంగీతం అందించారు. జీవితంలో తనకు ఎదురైన అవమానాలను తట్టుకొని.. కష్టాలను అధిగమించి.. ఇప్పుడు కర్నాటక గర్వించే వ్యాపారవేత్త స్థాయికి విజయ్ సంకేశ్వర్ ఎలా ఎదిగారో ఈ చిత్రంలో చూపిస్తున్నారు. విజయ్ సంకేశ్వర్, ఆయన కుమారుడు ఆనంద్ సంకేశ్వర్ పేరు కలిపి.. ఈ సినిమాకు విజయానంద్ అని పేరు పెట్టారు. డిసెంబరు 9న కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంలో విజయానంద్ సినిమా విడుదల కానుంది.
విజయ్ సంకేశ్వర్కి కన్నడ అంబానీగా పేరుంది. 1976లో ఒకే ఒక్క ట్రక్కుతో ఆయన తన వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం 45 ఏళ్లలోనే అగ్ర వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. ఇప్పుడు వీఆర్ఎల్ లాజిస్టిక్స్ కంపెనీలో ఏకంగా 5,550 ట్రక్కులు ఉన్నాయి. మనదేశంలో అత్యధిక కమర్షియల్ వాహనాలున్న వ్యక్తి ఈయనే. ప్రస్తుతం కర్నాటకలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న విజయ కర్నాటక పత్రికను కూడా విజయ్ సంకేశ్వరే ప్రారంభించారు. 2007లో టైమ్స్ గ్రూప్‌కు దానిని విక్రయించారు. ఆ తర్వాత 2012లో విజయ వాణి అనే పత్రికను కూడా స్థాపించారు. ప్రస్తుతం 8లక్షలకు పైగా డైలీ సర్క్యులేషన్‌తో కర్నాటకలో నెంబర్ 1గా డైలీ న్యూస్ పేపర్‌గా పేరు సంపాదించింది. విజయ్ సంకేశ్వర్కు రాజకీయ అనుభవం కూడా ఉంది. బీజేపీ నుంచి నార్త్ ధర్వాడ్ నుంచి ఎంపీ పనిచేశారు. కొన్నాళ్లకు బీజేపీ నుంచి బయటకొచ్చిన ఆయన.. కన్నడనాడు పార్టీని స్థాపించి.. ఆ తర్వాత మళ్లీ బీజేపీలోనే విలీనం చేశారు.
ఇక విజయానంద్ సినిమాలో విజయ్ సంకేశ్వర్ పాత్రలో నటిస్తున్న హీరో నిహాల్‌కు ఇది రెండవ చిత్రం. ఇంతకు ముందు ట్రంక్ అనే సినిమాలో నటించాడు. గతంలో థియేటర్ ఆర్టిస్ట్‌గానూ పనిచేశారు. విజయానంద్ సినిమా సూపర్ హిట్ అయ్యి.. తన కెరీర్‌ను మలుపు తిప్పుందనే ధీమాతో ఉన్నాడు నిహాల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Karnataka, Sandalwood