కేజీఎఫ్ స్టార్ యశ్ పై నోరు పారేసుకున్న కుమార స్వామి..

యశ్,కుమార స్వామి
- News18 Telugu
- Last Updated: April 17, 2019, 3:08 PM IST
కర్ణాటకలో లోక్‌సభ పోలింగ్ మరొకొన్ని గంటలే ఉంది. ఈ సందర్భంగా నేతలు ..ఒకరిపై ఒకరు వాగ్భాణాలు సంధించుకుంటున్నారు. కర్ణాటకలో జరగబోతున్న ఎన్నికల్లో అందరి చూపు మాండ్యా వైపే ఉంది. ఇక్కడ దివంగత నటుడు అంబరీష్ సతీమణి..సుమలత అంబీరీష్కు కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో..ఆమె స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా దేవగౌడ మనవడు..ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ..జేడీఎస్,కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. మరోవైపు సుమలతకు మద్దతులుగా కేజీఎఫ్ స్టార్ యశ్,మరో స్టార్ హీరో దర్శన్..సుమలత మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు శివరాజ్ కుమార్ వంటి హీరోలు ఇన్‌డైరెక్ట్‌గా ప్రచారం నిర్వహిస్తున్నారు.

సుమలతతో కన్నడ నటులు యశ్..
భర్త అంబరీష్‌ను తలుచుకొని భావొద్వేగానికి లోనైన సుమలత..
వెండితెరపై మరో భారీ మహా భారతం.. ‘కురుక్షేత్రం’ ట్రైలర్ విడుదల..
అంబరీశ్ పై అభిమానంతో ఆయన కొడుకు తొలి సినిమా టిక్కెట్‌ను లక్షల్లో కొనుగోలు చేసిన అభిమాని..
Lok Sabha Election 2019 Results: లోకసభ ఎన్నికల ఫలితాలు.. ఓడిన గెలిచిన ప్రముఖులు..
Lok Sabha Election 2019 Result: 52 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన సుమలత.. ‘మాండ్యా’లో అనూహ్య విజయం..
మాజీ ప్రధాని దేవెగౌడకు బిగ్ షాక్...తాత ఓడి మనవడు గెలిచాడు..

తండ్రి కుమార స్వామితో నిఖిల్ గౌడ
ఇక ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు నా లాంటి నిర్మాతలు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. అంతేకాదు ఆ తర్వాత ప్రజలను ఉద్దేశిస్తూ సిల్వర్ స్క్రీన్ పై చూసే ప్రతి విషయాన్ని నమ్మకండి. రోజు మీరు చూసే సంఘటనలే నిజాలు. అంతేకాదు మన దేశంలో ఎంతో మంది రైతులు సాగు చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నపుడు ఈ నటులుు ఎక్కడికి పోయారు అంటూ కుమార స్వామి ప్రశ్నించారు.