ఆలియా భట్‌ మా ఇంటి కోడలు కావాలంటున్న కరీనా కపూర్..

Alia Bhatt | Kareena Kapoor | ఆలియా భట్ తనకు మరదలు అయితే, ప్రపంచంలోనే ఎక్కువ సంతోషపడేది తానేనని కరీనా కపూర్ తెలిపింది. జియో మామి మువీ మేళా 2019లో భాగంగా కరణ్ జోహార్‌తో జరిగిన చిట్‌చాట్‌లో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: October 15, 2019, 1:59 PM IST
ఆలియా భట్‌ మా ఇంటి కోడలు కావాలంటున్న కరీనా కపూర్..
కరీనా, ఆలియా భట్
  • Share this:
రణబీర్ కపూర్, ఆలియా భట్.. వీరిద్దరు ప్రేమలో తేలియాడుతున్నారు. బాలీవుడ్‌లో పెళ్లికి తొందరపడుతున్న జంట వీరిదే. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని అభిమానులు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే, వీరిద్దరి పెళ్లి జరిగితే అందరి కంటే ఎక్కువ సంతోషపడేది ఎవరో తెలుసా? బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. ఆమే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ముంబైలో జియో మామి మూవీ మేళా 2019 వేడుక సందడి సందడిగా సాగింది. చర్చా కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు ఆసక్తిగా జరిగాయి. దీనికి కరీనా, దీపిక పదుకొణె, ఆలియా భట్, జాన్వీ కపూర్, కరణ్ జోహార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్.. కరీనా, ఆలియా భట్‌తో ఆసక్తికర చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రణబీర్ కపూర్, ఆలియా పెళ్లి చేసుకుంటే నువ్వు ఎలా ఫీలవుతావని కరీనాను అడగ్గా.. ‘ప్రపంచంలోనే ఎక్కువ సంతోషపడేది నేనే. ఆమె నాకు మరదలుగా, మా ఇంటి కోడలు అయితే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించింది. కాగా, కరీనాకు రణబీర్ వరుసకు సోదరుడు అవుతాడన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. కరీనాకు మరదలు అవుతావని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? అని ఆలియాను అడగ్గా.. ‘ఎప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతానికి ఓ విషయం గురించి ఆలోచించడం లేదు. సమయం వచ్చినపుడు ఆలోచిస్తా’నని వెల్లడించింది.First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు