ఇప్పుడు కరీనా కపూర్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఎప్పుడు బయటికి వచ్చినా కెమెరా ముందు అందాలు ఆరబోసి.. అభిమానుల ఊపిరి తీయడానికి సిద్ధంగా ఉంటుంది ఈ బెబో. పెళ్లైనా.. తల్లైనా కూడా తన పద్దతి మాత్రం మార్చుకోనంటుంది. ఇప్పుడు మరోసారి తన అందాల బ్లాక్ బస్టర్ చూపించింది కరీనా. ఈమె జోరు చూసి అబ్బో.. అదిరింది గురూ అందాల సోకు అంటున్నారు ఫ్యాన్స్. 39 ఏళ్లోచ్చినా కూడా ఇప్పటికీ అమ్మాయిగారు ఫిజిక్ విషయంలో మాత్రం పిచ్చెక్కిస్తున్నారు.
ఇప్పటికీ అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఔరా అనిపిస్తుంది కరీనా. ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తుంది కరీనా. దాంతో పాటే జిమ్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు ఈ పటౌడీ కోడలు. ఇప్పటికీ బికినీలు వేసుకుంటూ కుర్ర హీరోయిన్లను కూడా పరేషాన్ చేస్తుంది కరీనా. ఇప్పుడు ఏకంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్యాస్ట్యూమ్స్ వేసుకుని నిలువవే వాలు కనులదానా అన్నట్లు అందంగా హొయలు పోతూ ప్రాణాలు తీసేసింది కరీనా కపూర్. అయినా బాలీవుడ్లో అంతే.. బాలీవుడ్లో అంతే.. అక్కడ పెళ్లైనా పిల్లకు తల్లైనా పెద్దగా పట్టించుకోరు.
అక్కడ ఎవరి మాటా వినని సీతమ్మలే ఎక్కువగా ఉంటారు. ఇందులో కరీనా కపూర్ ముందు వరసలో ఉంటుంది. అందుకే ఇప్పటికీ అందాల ఆరబోతతో మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. వయసు 40కి చేరువగా వస్తున్నా కూడా బికినీతో కవ్విస్తుంది. మొన్నీమధ్యే భర్త సైఫ్‌తో కలిసి మాల్దీవ్స్ వెళ్లి పుల్లుగా ఎంజాయ్ చేయడమే కాకుండా బికినీ ఫోటోస్ తో పిచ్చెక్కించిన కరీనా.. ఈ మధ్యే ఫెమీనా మ్యాగజైన్ కోసం మరోసారి రెచ్చిపోయింది. ఇప్పుడు వోగ్ కోసం సోకులు వడ్డించింది. ఈ భామ దూకుడు చూసి ఔరా అనుకుంటున్నారు అంతా.
అసలు పటౌడీ ఖాన్దాన్ కోడలై ఉండి కూడా ఇప్పటికీ అదే స్థాయిలో అందాలు ఆరబోయడం.. సినిమాల్లో హాట్ సీన్స్‌తో రెచ్చిపోవడం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ ముద్దుగుమ్మ దూకుడుకు భర్త సైఫ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చేసాడు. దాంతో శ్రీవారే సై అన్న తర్వాత ముందు వెనక చూసుకోకుండా అందరికీ అన్ని అందాలు చూపిస్తుంది కరీనా కపూర్. తనకు నచ్చితే బికినీ వేయడం కాదు.. ముద్దుల్లో కూడా ముంచడానికి రెడీ అంటుంది కరీనా. అడిగితే ఇట్స్ ఆల్ ఇన్ ది పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ అంటూ కబుర్లు చెబుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Kareena Kapoor