Kareena Kapoor- Saif Ali Khan: బాలీవుడ్ క్యూట్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఇంట్లోకి ఇటీవల మరో వ్యక్తి చేరారు. కరీనా ఇటీవల రెండో కుమారుడికి జన్మను ఇచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉండటంతో పాటు.. కరీనా కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరీనా కపూర్‌కి మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చింది అని తెలిసినప్పటి నుంచి ఆ బిడ్డను చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఆ బిడ్డను అభిమానులకు పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయన్న టాక్ నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజం కాదని తెలుస్తుంది. తమ రెండో కుమారుడు విషయంలో సైఫ్, కరీనా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కొన్ని సంవత్సరాల పాటు ఆ బిడ్డను మీడియాకు దూరంగా ఉంచాలని వారు అభిప్రాయపడుతున్నారట. ఈ విషయాన్ని వారిద్దరి క్లోజ్ ఫ్రెండ్ ఒకరు తెలిపారు.
మొదటి బిడ్డ తైమూరు విషయంలో తమకు ఎదురైన కొన్ని అనుభవాలను మనసులో పెట్టుకున్న ఈ జోడి.. అవి రెండో బిడ్డకు కూడా ఎదురవ్వకూడదని భావిస్తున్నారట. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల పాటు ఆ బాబును మీడియాకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారట. అంతేకాదు వారి వారి సోషల్ మీడియాలలో సైతం రెండో కుమారుడి ఫొటోలను షేర్ చేయకూడదని వారు అనుకుంటున్నారట. ఇది నిజంగా కరీనా, సైఫ్ అభిమానులకు మాత్రం కాస్త చేదు వార్త కాగా.. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.
ఇదిలా ఉంటే ఇటీవల కరీనా కుమారుడికి ఏ పేరు పెట్టబోతున్నారన్న విషయంపై ఆమె తండ్రి రణ్‌ధీర్ కపూర్ స్పందించారు. అతడి కోసం కరీనా ఒక మంచి పేరును సెలక్ట్ చేసిందని.. అయితే దాన్ని రివీల్ చేసేందుకు చాలా సమయం ఉందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే తన మొదటి కుమారుడికి తైమూర్ అలీ ఖాన్ అని పెట్టిన తరువాత సైఫ్, కరీనాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. భారతదేశాన్ని ఆక్రమించడంతో పాటు ఇక్కడి వారిని ఇబ్బందులకు గురి చేసిన ఒక ముస్లిం రాజు పేరును ఎలా పెట్టారంటూ అప్పట్లో కొంతమంది రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kareena Kapoor, Saif Ali Khan