Kareena Kapoor: బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ రెండోసారి తల్లి అయిన విషయం తెలిసిందే. తమ ఇంట్లోకి మరో వ్యక్తి రాబోతున్నట్లు ఆగష్టులో సైఫ్ అలీ ఖాన్ దంపతులు అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే గర్భవతి అయినప్పటికీ కరీనా కపూర్ మాత్రం ఇంటి పట్టున ఉండటం లేదు. తన బేబీపై ఒత్తిడి పడకుండానే తన పని తాను చేసుకుపోతోంది. గర్భవతిగా ఉన్నప్పుడే ఆ మధ్యన ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్ధాను పూర్తి చేసింది ఈ హీరోయిన్. అప్పుడు ఆ మూవీ యూనిట్ కరీనాపై ప్రశంసలు కురిపించింది. కరీనా హార్డ్‌వర్క్‌కి హాట్సాఫ్ అంటూ ఆమిర్ టీమ్ పొగడ్తలు కురిపించారు.
View this post on Instagram
ఇక తాజాగా తన బేబి బంప్‌తో ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నారు కరీనా. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ తీసుకున్న కరీనా.. మేమిద్దరం షూటింగ్లో అంటూ కామెంట్ పెట్టారు. ఆ ఫొటోలో పింక్ దుస్తులతో ఆమె మరింత అందంగా కనిపిస్తున్నారు. ఇక ఈ ఫొటోకు అభిమానులతో పాటు కరీనా స్నేహితులు కామెంట్లు పెడుతున్నారు. కరోనా సమయంలో గర్భవతిగా నువ్వు చేస్తోన్న హార్డ్‌వర్క్‌ని మెచ్చుకోవాల్సిందే అంటూ కరీనా స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ మసాబా గుప్తా కామెంట్ పెట్టారు. అలాగే అమృతా అరోరా, రిద్దిమా కపూర్, మనీషా మల్హోత్రా తదితరులు కరీనా పోస్ట్‌పై స్పందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Kareena Kapoor, Saif Ali Khan