బాలీవుడ్ బెబో రెండో సారి కూడా మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కరీనా ఆదివారం ఫిబ్రవరి 21న పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు రిద్ధిమా కపూర్ తన సోషల్ మీడియాలో తెలిపింది. ఇక 2012లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్లు పెళ్లి చేసుకోగా.. 2016లో తైమూర్ అలీ ఖాన్ జన్మించాడు. కరీనాకు నాలుగేళ్ల కుమారుడు తైమూర్ ఖాన్ ఉన్నాడు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. లాల్ సింగ్ చద్దాలో అమీర్ ఖాన్ సరసన నటిస్తోంది. దీంతోపాటు కరణ్ జోహార్ తఖ్త్‌లో కూడా నటిస్తోంది.
ఇప్పుడు మరో బిడ్డ పుట్టాడు కాబట్టి అతడిని చూసుకోవడానికి ఆయా అవసరం ఉంటుంది. సహజంగా మీ ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి వచ్చే ఆయాకి జీతం ఎంత ఇస్తారు..? రూ. 5 వేలు.. మహా అయితే రూ.10 వేలు.. మరీ రిచ్ అయితే రూ.20 వేలు అనుకోండి. సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఎంత ఇస్తారో తెలుసా?. గతంలో కరీనా కపూర్ మొదటి బిడ్డ తైమూర్ అలీ ఖాన్‌ను చూసుకోవడానికి ఆయాను నియమించారు. ఆమె జీతం నెలకు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.1.50 లక్షలు.. మిగిలిన ఖర్చులు కూడా కలుపుకుని సుమారుగా రూ.1 లక్ష 75 వేలు. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. ఆ పిల్లాడి బాగోగులు చూస్తున్నందుకు ఆయనకు అన్ని లక్షలు ఇస్తున్నారు సైఫ్ అండ్ కరీనా. అక్కడితోనే ఆగలేదు.. ఆమె కోసం మళ్లీ విదేశీ ట్రిప్పులు కూడా ఉన్నాయి. అంతేకాదు.. ముంబైలో తిరగడానికి ఎప్పుడూ ఓ కార్ సిద్దంగా ఉంటుంది.
ఇప్పుడు బాలీవుడ్ పెద్దోళ్లంతా ఇలాంటి ఏజెన్సీలను నమ్ముకుంటున్నారు. సైఫ్ మాత్రమే కాదు.. తుషార్ కపూర్, సోహా అలీఖాన్ లాంటి వాళ్లు కూడా ఇలాంటి ఆయాలను తెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఇక్కడ సాఫ్ట్ వేర్ సాలరీస్ అంటే కూడా సైఫ్ ఇంట్లో ఆయాకు ఎక్కువ సాలరీ వస్తుంది. ఎంతైనా పటౌడీ ఫ్యామిలీ కదా.. ఆ మాత్రం రాజసం ఉంటుంది. అయితే, తైమూర్‌ను చూసుకున ఆయకు ఇచ్చే ఈ జీతం 2018 నాటిది. ఇప్పుడు 2021. కాబట్టి, ఈ ప్యాకేజీ మరింత పెరిగే అవకాశం ఉంది.
కరీనా కపూర్ ఇంట్లో ఇద్దరు బిడ్డలను చూసుకోవడానికి ఇద్దరిని వేర్వేరుగా నియమిస్తారా? లేకపోతే తైమూర్ అలీ ఖాన్‌ను చూసుకునే ఆమెకే అదనపు జీతం ఇచ్చి ఈ పసిబిడ్డను కూడా చూసుకునే బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి. అయితే, ఇలాంటి ఉద్యోగాలు చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని. వారికి చిన్న పిల్లలకు సంబంధించి సహజంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, వాటికి నివారణోపాయాలు, అనుభవం చాలా అవసరం. ఏదైనా చిన్న తేడా వస్తే పెద్ద వాళ్ల వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Bollywood heroine, Bollywood hot heroines, Kareena Kapoor