Home /News /movies /

KAREENA KAPOOR AMRITA ARORA TESTED CORONA POSITIVE TWO HEROINES ARE IN HOME ISOLATION EVK

Kareena Kapoor Corona Positive: క‌రీనా కపూర్‌, అమృతా అరోరాకు క‌రోనా పాజిటీవ్‌.. హోం ఐసోలేష‌న్‌లో హీరోయిన్‌లు

క‌రీనా కపూర్‌, అమృత ఆరోరా (ఫైల్‌)

క‌రీనా కపూర్‌, అమృత ఆరోరా (ఫైల్‌)

Kareena Kapoor Corona Positive: దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ప‌లువురు సెల‌బ్రెటీలు క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా కరీనా కపూర్ ఖాన్, అమృతా అరోరా కరోనా పాజిటివ్ వ‌చ్చింది. BMC (Brihanmumbai Municipal Corporation) వర్గాల ప్రకారం, సీమా ఖాన్‌కు మొదట కరోనా పాజిటివ్ అని తేలింది.

ఇంకా చదవండి ...
    భార‌త దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ప‌లువురు సెల‌బ్రెటీలు క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor), అమృతా అరోరా కరోనా పాజిటివ్ వ‌చ్చింది. BMC (Brihanmumbai Municipal Corporation) వర్గాల ప్రకారం, సీమా ఖాన్‌కు మొదట కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమెకు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు గుర్తించారు. డిసెంబర్ 11, 2021న ఆమె కోవిడ్ రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. ఆ తర్వాత మాత్రమే ఆదివారం కరీనా కపూర్, అమృతా అరోరా వారి కరోనా పరీక్ష చేయించుకున్నారు దీంతో వీర‌కి పాజిటీవ్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం 'ఫేబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' నటీనటులు డిసెంబర్ 8, 2021న దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar)పార్టీకి హాజరయ్యారు. ఈ నేప‌థ్యంలో కోవిడ్ కేసు న‌మోదు కావ‌డంతో పార్టీకి హాజ‌రైన వారంతా ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం బీఎంసీ (BMC) వివిధ బృందాలను ఏర్పాటు చేసి వీరికి స‌న్నిహితంగా ఉన్న వారి స‌మాచారాన్ని సేక‌రిస్తోంది.

    కరీనా, అమృతా అరోరా భవనాల్లో నివసించే వారిని పరీక్షించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం బీఎంసీ ఆ రెండు భవనాల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది.

    Covid-19 Vaccine Booster Dose: బూస్ట‌ర్ డోస్‌పై నిర్ణ‌యం తీసుకోవ‌డానికి మ‌రింత సమ‌యం ప‌డుతుంది: కేంద్రం


    అదే, కరణ్ జోహార్ యొక్క కరోనా పరీక్ష నెగిటీవ్‌ వచ్చినట్లు BMC వర్గాలు చెబుతున్నాయి. కరోనా యొక్క కొత్త వేరియంట్ Omicron గురించి WHO నుంచి నిరంతరం హెచ్చరిక‌లు చేస్తూనే ఉంది. ప్ర‌స్తుతం దేశంలో క‌ర‌నా కేసులు సంఖ్య పెరుగుతున్నాయి.

    ఒమిక్రాన్ ల‌క్ష‌ణాలు.. ప్ర‌భావం
    ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్ర‌త్యేకంగా లేవు.
    - డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొంద‌రిలో ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌డం లేదు.
    - వేరియంట్ సోకిన‌వారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
    - గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్న‌ట్టు వైద్యులు గుర్తించారు.
    ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువ‌గా ఉంటాయి.
    - వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువ‌గా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.

    ప్రస్తుతం దక్షిణాప్రికాలో SARS CoV 2 కొత్త రూపాంతరం చెంది వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఇది అత్యంత ఆందోళనకరమైన వేరియంట్ గా వర్గీకరించింది. దీనిపై ప్రపంచదేశాలు జాగ్రతగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరించింది. అయితే దీనికి ‘ఓమిక్రాన్’ అనే పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక దీనిపై ముఖ్యమైన దేశాలు అప్రమత్తం అయ్యాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Bollywood, Corona casess, Mumbai, Omicron

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు