హోమ్ /వార్తలు /సినిమా /

Karate Kalyani: దేవీ శ్రీ ప్రసాద్‌పై పోలీస్ కంప్లైంట్.. కరాటే కళ్యాణి స్ట్రాంగ్ వార్నింగ్

Karate Kalyani: దేవీ శ్రీ ప్రసాద్‌పై పోలీస్ కంప్లైంట్.. కరాటే కళ్యాణి స్ట్రాంగ్ వార్నింగ్

Devi Sri prasad Karate Kalyani (Photo Twitter)

Devi Sri prasad Karate Kalyani (Photo Twitter)

Devi Sri Prasad: తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ ఓ వివాదంలో చిక్కుకున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌పై సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. ఓ ఐటెం సాంగ్ విషయమై ఆమె మండిపడింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సినిమాల్లో, పాటల్లో వచ్చే కొన్ని పదాలు వివాదాస్పదం అవుతుండటం అనేది ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. చిన్న చిన్న ప్రైవేట్ సాంగ్స్ మొదలుకొని భారీ బడ్జెట్ సినిమాల వరకు ఇలాంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) ఇలాంటి ఓ వివాదంలోనే చిక్కుకున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌పై సినీ నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) ఫిర్యాదు చేసింది. ఓ ఐటెం సాంగ్ విషయమై ఆమె మండిపడింది.

చివరిగా పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. ఆ తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 మ్యూజిక్ పనుల్లో భాగమవుతూనే మరికొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిందీలో ఆయన రూపొందించిన ఓ పారి అనే పాప్ ఆల్బమ్ విడుదలైంది. విదేశీ మోడల్స్ తో కలిసి దేవి శ్రీ ప్రసాద్ తెగ హంగామా చేస్తూ ఈ ఆల్బమ్ తయారు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాల్లో చిత్రీకరించిన ఈ ఆల్బమ్ కోసం బడ్జెట్ కూడా బాగానే కేటాయించారట.

అయితే ఈ సాంగ్ కి సంబంధించి అన్ని బాధ్యతలు తీసుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. తీరా విడుదల తర్వాత చిక్కుల్లో పడ్డారు. ఈ పాటలో వాడిన కొన్ని పదాలపై వివాదం రాజుకుంది. దీంతో ఆయనపై సినీనటి కరాటే కళ్యాణి సహా పలు హిందూ సంఘాల వారు సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. దేవీ శ్రీ ఓ పారి ఆల్బంలో హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని వాడారని, ఓ ఐటెం సాంగ్ లో ఇలాంటి పదాలు వాడటం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అశ్లీలమైన దుస్తులు, నృత్యాలతో చేసిన ఈ ఆల్బంలో హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఉపయోగించినందుకు గాను దేవీ శ్రీ ప్రసాద్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి కోరింది. అంతేకాదు ఆ ఆల్బమ్ నిలిపివేయాలని పేర్కొంది. అదేవిధంగా హిందువులకు దేవీ శ్రీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే అని కరాటే కళ్యాణి డిమాండ్ చేసింది. ఒకవేళ ఆ మంత్రాన్ని అలాగే ఉంచితే దేవీ శ్రీ కార్యాలయాన్ని సైతం ముట్టడిస్తామని ఆమె హెచ్చరించింది. దీంతో ఇప్పుడు ఓ పారి ఆల్బమ్ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.

First published:

Tags: Devi Sri Prasad

ఉత్తమ కథలు