హోమ్ /వార్తలు /సినిమా /

Karate Kalyani : ఇకపై అలా చేస్తే వాళ్ల తాట తీస్తానంటున్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి..

Karate Kalyani : ఇకపై అలా చేస్తే వాళ్ల తాట తీస్తానంటున్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి..

కరాటే కళ్యాణి (File/Photo)

కరాటే కళ్యాణి (File/Photo)

Karate Kalyani : ఇకపై అలా చేస్తే వాళ్ల తాట తీస్తానంటున్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి.. వివరాల్లోకి వెళితే.

Karate Kalyani : ఇకపై అలా చేస్తే వాళ్ల తాట తీస్తానంటున్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి.. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా కరాటే కళ్యాణి.. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంది. ఈ క్రమంలో రీసెంట్‌గా విడుదలైన ‘ఇపుడు కాక ఇంకెప్పుడు’ సినిమాలో సీన్స్, డైలాగ్స్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తీసారంటూ రచ్చ నడిచింది. దీనిపై కొన్ని సంఘాల వాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో దర్శకుడు యుగంధర్ ఈ సినిమాలో శృంగార సన్నివేశాల సందర్భంగా వచ్చిన భజ గోవిందం పాటను తీసేసారు. ఐతే.. చిత్ర దర్శక,నిర్మాతలు తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికే కావాలనే భజ గోవిందం పాటను పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా కాంట్రవర్సీతో తమ సినిమాకు బోలేడు పబ్లిసిటి తెచ్చుకున్నారు.

సినిమాలో ఆది శంకరా చార్యుల వారి భజ గోవిందం పాట పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ.. ఇలాంటి అసభ్యకరమైన సన్నివేశాల్లో పరమ పవిత్రమైన ఈ గీతాన్ని వాడటంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రీసెంట్‌గా ప్రెస్‌క్లబ్బులో కొన్ని హిందు సంఘాల వాళ్లతో కలిసి సినీ నటి కరాటే కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా సినిమాలు నిర్మించే వారిపై ఫైర్ అయ్యారు. సినిమాల ప్రభావం సమాజంపై ఎంతో ఉంటుంది. పిల్లలపై వాటి  ప్రభావం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.

Karate Kalyani : ఇకపై అలా చేస్తే వాళ్ల తాట తీస్తానంటున్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి.. వివరాల్లోకి వెళితే.
కరాటే కళ్యాణి ప్రెస్ మీట్ (Twitter/Photo)

నేను ఎన్నో సినిమాల్లో నటించాను. సినిమాల్లో పనిచేస్తున్నానని దేవీ, దేవుళ్లకు సంబంధించిన వాటిని  కించపరుస్తానంటే నేను సపోర్ట్ చేయనన్నారు. ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే నేను ఎక్కడకైనా ఎంత దూరమైన వెళ్లడానికి రెడీ అన్నారు. నా సంస్కృతి,సంప్రదాయాలను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. మరోవైపు ‘వరుడు కావాలను’ సినిమాలో ‘దిగు దిగు నాగ పాట’తో పాటు ‘మహా సముద్రం’ సినిమాలోని  ఓ డైలాగు కూడా శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తారు..  ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం ఎత్తారు. మనం ఆఫ్ట్రాల్ బీరు బాటిల్ ఎత్తలేమా అంటూ ఉన్న డైలాగ్ పై సినిమా దర్శకుడు అజయ్ భూపతి పై ఫైర్ అయ్యారు. గోవర్ధన గిరిని, సంజీవిని పర్వతాన్ని బీరు బాటిల్‌తో పోల్చడం ఏమిటంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక భారతీయ స్త్రీగా ఇలాంటివి నేను తప్పకుండా ప్రశ్నిస్తానని కాస్త గట్టిగానే చురకలు వేసారు కరాటే కళ్యాణి. అంతేకాదు మా సహానాన్ని పరీక్షించవద్దు అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయమై ఫిల్మ్ కౌన్సిల్‌తో పాటు ఆయా దర్శక, నిర్మాతలను కలిసి అభ్యంతర డైలాగులు తొలిగించాలని కోరినట్టు చెప్పారు. మరోవైపు ‘ఇపుడు కాక ఇంకెపుడు’ సినిమా సెన్సార్ చేసినపుడు ఇలాంటి అభ్యంతర డైలాగులు లేవు. కానీ సినిమా ప్రచారం కోసం ఛీఫ్‌గా ఇలాంటి ట్రిక్స్ ప్రయోగించినట్టు తమకు సెన్సార్ వాళ్లు ఇచ్చి సర్టిఫికేట్‌ను ప్రదర్శించారు.

Karate Kalyani : ఇకపై అలా చేస్తే వాళ్ల తాట తీస్తానంటున్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి.. వివరాల్లోకి వెళితే.
ఫిల్మ్ ఛాంబర్‌లో కరాటే కళ్యాణి ఫిర్యాదు (Twitter/Photo)

మొత్తంగా సినిమాల్లో అభ్యంతరకర డైలాగ్స్ రాస్తున్న దర్శక, నిర్మాతలకు కరాటే కళ్యాణి కాస్త ఘాటుగానే హెచ్చరించారు. అంతేకాదు ఇలాంటి చెత్త ట్రిక్స్‌తో సినిమాలను ప్రమోట్ చేయాలనుకునే వాళ్ల తాట తీస్తానంటూ ఓ రేంజ్‌‌లో ఫైర్ అయ్యారు. ఇక పై సినిమాల్లో  హిందు దేవీ, దేవతలను అవమాన పరిచేలా సినిమాలు తీస్తే వాళ్లకు ఒదిలే ప్రసక్తి లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఓ లిమిట్ ఉంటుంది. కానీ కొంత మంది దర్శక, నిర్మాతలు తమ పరిధి దాటి  ఓ వర్గం వారి మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నారంటూ కరాటే కళ్యాణి  వ్యాఖ్యానించారు. 

ఇవి కూడా చదవండి.. 

Balakrishna - Mahesh Babu: మహేష్ బాబు కాపీ కొట్టిన బాలకృష్ణ ఈ సినిమాలు గురించి తెలుసా..

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలలో అమితాబ్ కాకుండా మరో ఇద్దరు స్టార్ హీరోలు..

Mammootty@50 Years: మమ్ముట్టి నట ప్రస్థానానికి 50 యేళ్లు పూర్తి.. సాధించిన అవార్డులు ఇవే..

ఈ ఫోటోలో క్యూట్ కనిపిస్తోన్న ఈ చిన్నది.. ప్రభాస్ సరసన నటించిన క్రేజీ హీరోయిన్..

Chiranjeevi - Balakrishna: ఇప్పటి వరకు శాటిలైట్ హక్కులు అమ్ముడు పోని బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఏవంటే..

First published:

Tags: Bigg Boss 4 Telugu, Bigg Boss 5 Telugu, Karate Kalyani, Tollywood