విజయ్ దేవరకొండతో జాన్వీ.. నిర్మాతగా కరణ్ జోహార్

Twitter

విజయ్ దేవరకొండ చాలా రోజుల నుంచి ఓ హిందీ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

 • Share this:
  అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌.. తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటనతో అదరగొట్టి హిందీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన 'సైరాత్‌'‌‌కు రీమేక్‌గా వచ్చింది.  ప్రముఖ హిందీ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించారు.  ప్రస్తుతం జాన్వీ..  ‘కార్గిల్‌ గాళ్‌', 'రుహీ అఫ్జా', 'తక్త్‌’ సినిమాలలో నటిస్తూ  హిందీలో బీజీగా గడుపుతోంది. ఇది అలా ఉండగా జాన్వీ సౌత్‌లో నటించడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ బ్యూటీని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసే బాధ్యతను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ తీసుకున్నారు. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్‌'తో సూపర్‌ హిట్ అందుకున్న పూరి, తన నెక్ట్స్ సినిమాను విజయ్‌ దేవరకొండతో చేస్తున్నాడు. ఇదే విషయాన్ని నిర్మాత చార్మీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  కాగా.. ఈ సినిమా ద్వారా పూరీ.. జాన్వీని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేయనున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఫైటర్ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చెయ్యటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

  Twitter
  Twitter


  విజయ్ దేవరకొండ చాలా రోజులనుంచి ఓ హిందీ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను ఈ ఫైటర్‌తో బాలీవుడ్‌‌కి పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడట అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు కరణ్ జోహారే జాన్వీని కూడా ఒప్పించాడట.  ఈ ఫైటర్ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు చిత్ర దర్శకనిర్మాతలు. ఫైటర్‌ను కరణ్ జోహార్, పూరి, ఛార్మిలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.
  చీరలో అదిరిన కియారా అందాలు...
  Published by:Suresh Rachamalla
  First published: