కరణ్ జోహార్ డిప్రెషన్‌లోకి వెళ్తున్నాడా.. ఆ పదవికి రాజీనామా..

కరణ్ జోహార్ (Karan Johar)

Karan Johar: డిప్రెషన్ అనే పదం ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. ఎప్పట్నుంచో ఉన్నా కూడా ఇప్పుడు మళ్లీ వినిపించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత డిప్రెషన్ అనేది బాగా వాడేస్తున్నారంతా.

  • Share this:
డిప్రెషన్ అనే పదం ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. ఎప్పట్నుంచో ఉన్నా కూడా ఇప్పుడు మళ్లీ వినిపించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత డిప్రెషన్ అనేది బాగా వాడేస్తున్నారంతా. తమకు కూడా ఒకప్పుడు డిప్రెషన్ బాగా ఉండేదని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా డిప్రెషన్‌లోకి వెళ్తున్నాడని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు చూసి అంతా ఇదే అనుకుంటున్నారు కూడా. సుశాంత్ ఆత్మహత్య చేసుకోడానికి కరణ్ జోహార్ ముఖ్య కారణం అంటూ ఆయనపై కేసు కూడా ఫైల్ అయింది.
సుశాంత్ సింగ్ కరణ్ జోహార్ (sushant singh rajput karan johar)
సుశాంత్ సింగ్ కరణ్ జోహార్ (sushant singh rajput karan johar)

అభిమానులు కూడా ఆయనపైనే ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్‌లో ఎందుకూ పనికిరాని వాళ్లను తీసుకొచ్చి స్టార్స్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే సుశాంత్ లాంటి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని హీరోలను తొక్కేస్తున్నాడు అంటూ కరణ్ జోహార్‌పై నిప్పులు కక్కుతున్నారు ఫ్యాన్స్. ఆయనతో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నా.. ముఖ్యంగా కరణ్ అయితే అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇప్పటి నుంచి నువ్వు నిర్మించే సినిమాలు కానీ.. తీసే సినిమాలు కానీ అస్సలు చూడమంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు ప్రేక్షకులు.
కరణ్ జోహార్ (Karan Johar)
కరణ్ జోహార్ (Karan Johar)

ఇలాంటి టఫ్ సిచ్యువేషన్‌లోనూ బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా కరణ్ జోహార్ పక్షాన నిలబడటం లేదు. ఆయన గురించి మాట్లాడటం లేదు.. సైలెంట్‌గా ఉండిపోతున్నారు. దాంతో కరణ్ కూడా చాలా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది. అందుకే సోషల్ మీడియాలో అందర్నీ అన్ ఫాలో చేసేసాడు.. దాంతో పాటు ఇన్‌స్టాలో కూడా చాలా మందిని పక్కనబెట్టేసాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి.
సుశాంత్ సింగ్ కరణ్ జోహార్ (sushant singh rajput karan johar)
సుశాంత్ సింగ్ కరణ్ జోహార్ (sushant singh rajput karan johar)

అసలు బయటికి కూడా రావడం లేదని.. ఇంట్లోనే ఉండిపోతున్నాడని తెలుస్తుంది. అంతేకాదు.. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే MAMI ఫిల్మ్ డెవలప్‌మెంట్‌లో కీలకమైన పదవికి కూడా రాజీనామా చేసాడు కరణ్ జోహార్. ఇవన్నీ ఆయన డిప్రెషన్‌తోనే చేస్తున్నాడని.. సుశాంత్ మరణం తర్వాత అందరూ తనను నిందిస్తుంటే అండగా ఎవరూ రావడం లేదనే బాధ కూడా కరణ్‌లో కనిపిస్తుందని సన్నిహితులు చెప్తున్నారు. మరి చూడాలిక.. భవిష్యత్తులో ఇంకా కరణ్ జోహార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడో..?
First published: