డ్రగ్స్ పార్టీ ఆరోపణలపై కరణ్ జోహార్ రియాక్షన్.. ఎట్టకేలకు నోరు విప్పిన దర్శకుడు

ఒకవేళ తన ఇంట్లో జరిగిన పార్టీలో నిజంగానే డ్రగ్స్ తీసుకుని ఉంటే.. ఆ వీడియోను తానే ఎందుకు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తానని, అలా పెట్టడానికి తానేమీ స్టుపిడ్‌ని కాదని కరణ్ జోహార్ ప్రశ్నించారు.

news18-telugu
Updated: August 19, 2019, 3:35 PM IST
డ్రగ్స్ పార్టీ ఆరోపణలపై కరణ్ జోహార్ రియాక్షన్.. ఎట్టకేలకు నోరు విప్పిన దర్శకుడు
కరణ్ జోహార్(File Photo)
news18-telugu
Updated: August 19, 2019, 3:35 PM IST
బాలీవుడ్ నిర్మాత,దర్శకుడు కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో పలువురు బాలీవుడ్ తారలు డ్రగ్స్ తీసుకున్నారని
శిరోమణి అకాళీదళ్ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఇన్నాళ్లు మౌనం వహించిన కరణ్ జోహార్.. ఎట్టకేలకు నోరు విప్పారు. ఒకవేళ తన ఇంట్లో జరిగిన పార్టీలో నిజంగానే డ్రగ్స్ తీసుకుని ఉంటే.. ఆ వీడియోను తానే ఎందుకు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తానని, అలా పెట్టడానికి తానేమీ స్టుపిడ్‌ని కాదని కరణ్ జోహార్ ప్రశ్నించారు. వీకెండ్ కావడంతో.. అందరం సరదాగా కలుసుకుని.. వైన్ తాగుతూ మాట్లాడుకున్నామని చెప్పారు. తాను ఆ వీడియో తీయడానికి కొద్దిసేపటి ముందువరకు కూడా మా అమ్మ అక్కడే ఉందని కరణ్ జోహార్ తెలిపారు. అమ్మ కూడా అక్కడే ఉందంటే.. ఆ పార్టీ ఎంత మంచి వాతావరణంలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. జర్నలిస్ట్ రాజీవ్ మసంద్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ విషయాలు వెల్లడించారు.

ఇదే వీడియోలో దర్శకుడు విక్కీ కౌశల్‌‌‌ను చూసి.. అతను డ్రగ్ పౌడర్‌ తీసుకున్నాడని కొంతమంది ఆరోపించారు. దానిపై కరణ్ జోహార్ స్పందిస్తూ..' ముక్కు గోక్కోవడానికి కూడా పర్మిషన్ లేదు.. నీ ఫోన్ నీ బ్యాక్ పాకెట్‌లో పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. అలాగే ఏదో ఊహించుకుని డ్రగ్ పౌడర్ అంటున్నారు' అని ఎద్దేవా చేశారు. నిజానికి తాను ఈ ఆరోపణలపై స్పందించాలనుకోలేదని.. కానీ స్పందించక తప్పట్లేదని అన్నారు. తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని.. ఆరోజు రాత్రి లైట్ మ్యూజిక్,పాటలు,సరదా ముచ్చట్లతో గడిపామని చెప్పారు. కరణ్ జోహార్ ఇచ్చిన ఈ పార్టీకి దీపికా పదుకొణే, విక్కీ కౌశల్,రణ్‌బీర్ కపూర్,షాహిద్ కపూర్,వరుణ్ ధావన్,మలైకా అరోరా తదితరులు హాజరయ్యారు.
బాలీవుడ్ నటుల నిజస్వరూపం ఇదే.. డ్రగ్స్ మత్తులో ఎలా తూలుతున్నారో చూడండి : ఎమ్మెల్యే ఆరోపణలు
First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...