షారుఖ్‌కి కరణ్ జోహార్ ఖరీదైన గిఫ్ట్... దాని విలువ ఎంతో తెలుసా..

షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.

news18-telugu
Updated: October 21, 2019, 10:34 AM IST
షారుఖ్‌కి కరణ్ జోహార్ ఖరీదైన గిఫ్ట్... దాని విలువ ఎంతో తెలుసా..
షారుఖ్, కరణ్ Photo : Instagram
  • Share this:
షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. 'కుచ్ కుచ్ హోతా హై', 'కబీ ఖుష్ కబీ గమ్', 'కబీ అల్వీదా నా కహెనా', 'మైనేమ్ ఈజ్ ఖాన్'...వంటి సినిమాలతో  వరుసగా హిట్స్ కొడుతూ.. బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. కరణ్ నిర్మించిన పలు సినిమాల్లో షారుఖ్ నటించారు. అయితే షారుఖ్ ఈ మధ్య నటించిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ దగ్గర అలరించలేక పోతున్నాయి. అది అలా ఉంటే.. కరణ్ జోహార్ తన మిత్రుడు షారుఖ్‌కు ఓ అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు. ప్రత్యేకంగా తయారు చేసిన ఓ పాపులర్ బ్రాండ్‌కు చెందిన జాకెట్ ను బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని షారుఖ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన అభిమానులతో పంచుకున్నారు. ఆయన తన పోస్ట్‌లో రాస్తూ.. ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు కరణ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. కరణ్ ఫ్యాషన్ సెన్స్‌‌ను అందుకోవడం కష్టం అని తెలిపారు.
కాగా ఈ జాకెట్ ఖరీదు దాదాపుగా రూపాయలు ఒక లక్ష, పాతిక వేలకు పైగా ఉండనుందని తెలుస్తోంది. అది అలా ఉంటే ప్రస్తుతం సరైన హిట్స్ లేక సతమతమవుతున్న షారుఖ్ త్వరలోనే  తన మిత్రుడు కరణ్ జోహార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారని సమాచారం.
View this post on Instagram

Hosted the @vogueindia #voguewomenoftheyearawards in stripes and stilts! Styled by @nikitajaisinghani 📷 @rahuljhangiani


A post shared by Karan Johar (@karanjohar) on

స్విమ్మింగ్ పూల్‌లో అందాలను ఆరబోసిన అలియా భట్..
Published by: Suresh Rachamalla
First published: October 21, 2019, 10:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading