news18-telugu
Updated: February 6, 2019, 9:03 AM IST
రాజ్ కుమార్ రావ్
బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ గే కమ్మూనిటీ గురించి మాట్లాడుతూ తాను త్వరలోనే హోమో సెక్సువల్ సబ్జెక్ట్‌తో ఒక సినిమా తెరకెక్కించబోతున్నట్టు చెప్పాడు.
ఈ సినిమాలో బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు నటించబోతున్నారని కూడా వెల్లడించాడు. దీనిపై హీరో రాజ్ కుమార్ రావ్ స్పందిస్తూ ..ఏదైనా గే ఫిల్మ్‌లో నటించాల్సి వస్తే..తాను రణ్వీర్ సింగ్‌తో నటించాలని ఉందని చెప్పాడు. అంతేకాదు నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఆయన రణ్వీర్ సింగ్ ఒకరన్నారు. తాజాగా రాజ్ కుమార్ రావ్ నటించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
గత కొన్నేల్లుగా వెరైటీ సినిమాలతో ఆయనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మరోవైపు రణ్వీర్ సింగ్ కూడా డిఫరెంట్ పాత్రలతో బాలీవుడ్ అగ్రహీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కరణ్ జోహార్ భారీ బడ్జెట్‌తో ‘తఖ్త్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రణ్వీర్ సింగ్, రాజ్ కుమార్ రావు కాంబినేషన్లో రాబోతున్న గే ఫిల్మ్‌ను తెరకెక్కించినున్నాడు.
నయనతార లేెటెస్ట్ ఫోటోస్
ఇవి కూడా చదవండి
మురుగదాస్ కోసం రజినీకాంత్ త్యాగం..ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..ఓరి దేవుడో..బాలయ్య హీరోయిన్ సెగలు పుట్టించిందిగా..
దిల్‌రాజు కారు గిఫ్ట్ క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
Published by:
Kiran Kumar Thanjavur
First published:
February 6, 2019, 8:42 AM IST