Home /News /movies /

KARAN JOHAR COMMENTS ON VIRATA PARVAM TRAILER AND PRAISES RANA SAI PALLAVI SB

Virata Parvam: రానా విరాటపర్వంపై కరణ్ జోహార్ ట్వీట్... సాయిపల్లవి విషయంలో షాకింగ్ కామెంట్స్

Photo Twitter

Photo Twitter

విరాటపర్వం ట్రైలర్ రిలీజ్ అయి దూసుకెళ్లుంది. ఈనెల 17న ఈ సినిమా రిలీజ్ కానుంది, దీంతో పలువురు ప్రముఖులు విరాటపర్వంపై పలు కామెంట్లు చేస్తున్నారు.

    ప్రస్తుతం టాలీవుడ్‌లో విరాట పర్వం సినిమా హవా నడుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నీది నాది ఒకే కథ' చిత్రంతో వేణు ఊడుగుల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. దీనితో విరాటపర్వం కథని చాలా ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కిస్తున్నారు వేణు ఉడుగుల.  నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రానా ఎంచుకున్న మరో ప్రయోగాత్మక చిత్రం ఇది.

    ఈ సినిమా దాదాపు మూడేళ్ల నిరీక్షణ తరువాత జూన్ (June) 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వబోతోంది. ఇందులో రానా, ప్రియమణి (Priyamani)నక్సలైట్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ .. స్పెషల్ వీడియోస్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈసినిమా నుంచి సాలిడ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ ట్రైలర్ లో నట విశ్వరూపంచూపించారు రానా, సాయి పల్లవి. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు చేశాడు.



    ప్రముఖ బాలీవుడ్ వ్యక్తి ట్విట్టర్‌ వేదికగా వెళ్లి రానా దగ్గుబాటి విరాట పర్వం ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. అతను ట్వీట్ చేస్తూ, అద్భుతంగా ఉంది రానా, దానిని చూడటానికి వేచి ఉండలేము. తీవ్రమైన రా , రివెట్టింగ్. మీరు అద్భుతమైనవారు. నేను సాయిపల్లవికి పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చారు. విరాటపర్వంలో మరో హీరో నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు, ప్రియమణి, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.



    మరోవైపు విరాట పర్వం చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. వేణు ఊడుగుల తన దర్శకత్వంలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోని కథని ఎమోషనల్ గా పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తున్నారు. రానా, సాయి పల్లవి స్టోరీ థీమ్ కి తగ్గట్లుగా నటనలో చెలరేగిపోయారు. దీంతో ట్రైలర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎస్ ఎల్ వి సినిమాస్ యూట్యూబ్ ఛానల్ లో విరాట పర్వం ట్రైలర్ 6 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఇప్పటికే ట్రైలర్‌పై అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Karan Johar, Rana daggubati, Sai Pallavi, Virata Parvam

    తదుపరి వార్తలు