Home /News /movies /

KARAN JOHAR BIRTHDAY BASH LEAVES 55 GUESTS COVID INFECTED SB

Oh My God: ఆ పార్టీకి వెళ్లిన 55 మంది సినీ ప్రముఖులకు పాజిటివ్.. సీక్రేట్‌గా ఉంచిన ఇండస్ట్రీ..!

బర్త్ డే పార్టీలో కరోనా కలకలం

బర్త్ డే పార్టీలో కరోనా కలకలం

ఇప్పటికే కొందరు.. కరోనా బారిన పడ్డారు. అయితే ఎవరెవరు ఇన్‌ఫెక్ట్ అయ్యారన్న పూర్తి సమాచారం మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. నిర్మాత పరువు ఎక్కడ పోతుందోనని... విషయం బయటకు పొక్కకుండా సీక్రేట్ మెంటైన్ చేస్తున్నారు.

  సినీ ఇండస్ట్రీని మరోసారి ఇప్పుడు కరోనా (Covid) టెన్షన్ పుట్టిస్తోంది. తాజాగా సినీ ప్రముఖులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతుండంతో చిత్రపరిశ్రమకు చెందినవారు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. గతనెల ఓ బడా ప్రొడ్యూసర్(Producer Birthday Party) తన బర్త్ డే పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీకి సినీరంగానికి చెందిన ప్రముఖులంతా క్యూ కట్టారు. పెళ్లిళ్లు అయిన వాళ్లు, భార్య,భర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక పెళ్లి కాని వారు బాయ్ ఫ్రెండ్స్‌, కోస్టార్స్‌తో కలిసి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అయితే ఈ పార్టీకి వచ్చిన ఒక్కొక్కరు ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడుతున్నట్లు సమాచారం. మొత్తం 55 మందికి కోవిడ్ సోకినట్లు తెలుస్తుంది. అయితే నిర్మాత పరువు ఎక్కడ పోతుందోనని ఎవరూ బయటకు చెప్పడం లేదని తెలుస్తుంది.

  ఇప్పటికే అర్థం అయిపోయే ఉండాలి. ఆ బడా నిర్మత ఎవరో. ఆ నిర్మాత ఇంకెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్,(Karan Johar) కరణ్ జోహార్ ఇటీవలే.. తన 50వ జన్మదిన వేడుకల్ని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ (Bollywood)  ప్రముఖులందరికీ కూడా అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఇక ఈ పార్టీకి బాలీవుడ్ ప్టార్ హీరోలు.. యంగ్ హీరోలు అంతా తరలివచ్చారు, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్,కాజల్,మాధురి, జూహీ చావ్లా,రవీనా టండన్, జాన్వీ కపూర్, రణ్వీర్ సింగ్, దీపికా, కత్రినా, కియారా, కృతి సనన్..,వరుణ్ ధావన్, సిద్ధార్థ మల్హోత్రా,ఆదిత్య రాయ్ కపూర్ ఇలా ఒకరేంటి.. ఇలా భారీగా సెలబ్రిటీలంతా కరణ్ జోహార్ పార్టీకి తరలివచ్చారు.  ముంబై(Mumbai) అంధేరిలోని యష్ రాజ్ స్టూడియోలో పార్టీ ఏర్పాటు చేశారు.  అయితే ఈ పార్టీకి వచ్చిన ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా నిబంధనలు పాటించలేదు. ఒక్క సెలబ్రిటీ ముఖానికి కూడా మాస్క్ కనిపించడం లేదు. శానిటైజర్లు, మాస్కులు ఎక్కడా కనిపించలేదు. దీనికి తోడు.. అందరూ హగ్గులు, ముద్దులు పెట్టుకున్నారు. తారాలంతా ఫుల్ ఎంజాయ్ చేస్తూ డాన్సులు కూడా చేశారు. పార్టీకి చెందిన వీడియోలు కూడా బయటకు వచ్చి తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు పార్టీలో పాల్గొన్న ఒక్కొక్కరు కరోనా బారినపడటంతో మిగతా సెలబ్రిటీల్లో టెన్షన్ మొదలయ్యింది.

  తాజాగా భూల్ భులయ్య 2 హీరో కార్తీక్ ఆర్యన్ కోవిడ్ బారిన పడ్డాడు. అయితే అతడు కరణ్ ఇచ్చిన పార్టీకి రాలేదు. కానీ.. ఈ పార్టీకి హాజరైన కియారా, టబుతో కలిసి.. సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. దీంతో వీరిద్దరి వల్లే.. కార్తీక్‌కు కోవిడ్ సోకిందా అనే చర్చ మొదలయ్యింది. అలా అయితే కియారకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందా అని జనం చర్చించుకుంటున్నారు. మరోవైపు కరణ్ పార్టీకి హాజరైన ఆదిత్య రాయ్ కపూర్‌ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. అయితే చాలామంది తమకు పాజిటివ్ వచ్చినా కూడా నిర్మాత పరువు ఎక్కడ పోతుందోనని బయటకు చెప్పడం లేదని కూడా తెలుస్తోంది. అయితే తాజాగా జరిగిన ఐఫా అవార్డ్స్‌లో సైతం పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరుకాలేదు. దీంతో ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లు అయ్యింది.  మొత్తానికి కరణ్ జోహార్ పార్టీతో  బాలీవుడ్‌లో మరోసారి కరోనా కలకలం మొదలయ్యింది. ఇప్పుడు ఈ వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు. మంచి పని అయ్యింది అని కొందరు కామెంట్లు చేస్తుంటే... కరణ్ అందరికీ రిటన్ గిఫ్ట్ ఇచ్చాడంటూ మరికొందరు సెటైర్లు చేస్తున్నారు.
  Published by:Sultana Shaik
  First published:

  Tags: Bollywood, Coronavirus, Covid, Karan Johar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు