హోమ్ /వార్తలు /సినిమా /

Kantara Movie Review: ’కాంతారా’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్..

కాంతారా (Kantara)
కాంతారా (Kantara)
3/5
రిలీజ్ తేదీ:15/10/2022
దర్శకుడు : రిషబ్ శెట్టి (Rishab Shetty)
సంగీతం : అజనీశ్ లోకనాథ్
నటీనటులు : రిషబ్ శెట్టి, కిషోర్,అచ్యుత్ కుమార్,ప్రమోద్ శెట్టి,సప్తమి గౌడ తదితరులు..
సినిమా శైలి : సస్పెన్స్ థ్రిల్లర్
సినిమా నిడివి : 2 Hr 30 Minits

Kantara Movie Review: ’కాంతారా’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్..

‘కాంతారా’ మూవీ రివ్యూ (Twitter/Photo)

‘కాంతారా’ మూవీ రివ్యూ (Twitter/Photo)

Kantara Telugu Movie Review: గత కొన్నేళ్లుగా కన్నడ సినిమాలు తెలుగు తర్వాత ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నాయి. ఈ కోవలో రిషబ్ శెట్టి తానే హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతారా’. మరి కన్నడలో దుమ్ము దులుపుతున్న ఈ చిత్రం ఈ రోజు తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్టు ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : కాంతారా (Kantara)

నటీనటులు : రిషబ్ శెట్టి, కిషోర్,అచ్యుత్ కుమార్,ప్రమోద్ శెట్టి,సప్తమి గౌడ తదితరులు..

ఎడిటర్: కే.ఎమ్. ప్రకాష్, ప్రతీక్ శెట్టి

సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్

సంగీతం: అజనీశ్ లోకనాథ్

నిర్మాత : హోంబలే ఫిల్మ్స్, విజయ్ కిరంగదూర్

దర్శకత్వం: రిషబ్ శెట్టి

విడుదల తేది : 15/10/2022

కన్నడ హీరో రిషబ్ శెట్టి తానే హీరోగా తన స్వీయ  దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కాంతారా’. మరి కన్నడలో దుమ్ము దులుపుతున్న ఈ చిత్రం ఈ రోజు తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్టు ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా 1847 బ్యాక్‌డ్రాప్‌ మొదలవుతోంది. అపుడు మన దేశంలో ఇంకా వివిధ రాజ్యాలు పాలన చేస్తూ ఉంటాయి. అందులో ఒక రాజ్యానికి చెందిన రాజుకు ఎన్ని దాన ధర్మాలు చేసిన పూజలు చేసిన ఏదో తెలియని అశాంతి వెంటాడుతుంది. ఈ క్రమంలో రాజ పురోహితులు చెప్పిన ప్రకారాం ప్రశాంతత కోసం దేశాటనకు బయలుదేరుతారు. ఐతే..  ఈ క్రమంలో ఒక అడవి ప్రదేశంలో ఒక దేవత మూర్తి కనిపిస్తోంది. అది ఒక ఆటవిక ప్రాంతానికి చెందిన కుల దైవం. ఆ దైవాన్ని తనకిస్తే.. ఆ దేవుడికి చెందిన దేవ నర్తకుడు శబ్ధం ఎంత వరకు వినిపిస్తుందో అంత రాజ్యం ఇస్తా అని రాజు చెబుతాడు. చెప్పిన ప్రకారం రాజు అంత రాజ్యం ఇస్తాడు.  ఆ తర్వాత కొన్ని తరాల తర్వాత ఆటవిక ప్రాంతానికి ఇచ్చిన  భూమిపై రాజు గారి వారసుల కన్ను పడుతోంది. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. ఆ తర్వాత ఆ రాజు వారసులు ఆ అటవి ప్రాంతానికి చెందిన భూమికి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో దైవశక్తి వారికి అడ్డు తగులుతుంది ? ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఈ  ‘కాంతారా’ మూవీ స్టోరీ.

కథనం.. టెక్నిషియన్స్ విషయానికొస్తే..

‘కాంతార’ సినిమాను హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించారు. ఇక కాంతారా అంటే అడవి అని సంస్కృతం అర్థం. ఈ సినిమా కూడా అటవి నేపథ్యంలో సాగుతోంది. ఈ సినిమాను హీరో కమ్ దర్శకుడు 1847 బ్యాక్ డ్రాప్‌లో మొదలు పెట్టి.. ఆ తర్వాత 1970లో తీసుకొస్తాడు. అక్కడ రాజా వారి వారసుడు ఆటవికులకు కుల దైవానికి ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు. ఈ సందర్భంగా దైవ నర్తకుడు అది సరైన పని కాదంటాడు. ఆ తర్వాత దైవ నర్తకుడు అడవిలో మాయమైపోతాడు. ఇక దైవ నర్తకులు ఫ్యామిలీలోనే హీరో ఉంటాడు.  ఆ తర్వాత రాజా వారి వారసుడు కోర్డు ఆవరణలో రక్తం కక్కుకొని చనిపోతాడు. ఈ సీన్స్ చూస్తుంటే.. మనకు మురారి సినిమా గుర్తుకు వస్తోంది. ఆ తర్వాత కథ 1990లో తీసుకొస్తాడు దర్శకుడు.  అప్పటి పల్లె వాతావరణం.. అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఒకింత మనకు రంగస్థలం సినిమా గుర్తుకు వస్తోంది. ఇంటర్వెల్ వరకు సాదాసీదా సాగిన స్టోరీని ఆ తర్వాత పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా  క్లైమాక్స్ సన్నివేశాలతో ఈ సినిమాను మనల్ని ఏదో లోకానికి తీసుకెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా ఒక సాదాసీదా కథను తనదైన స్క్రీన్ ప్లేతో దైవత్వాన్ని జోడించి తెరకెక్కించడంలో దర్శకుడిగా రిషబ్ సక్సెస్ అయ్యాడు.  అటు నటుడిగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా మిగతా నటీనటులు మనకు అంతగా తెలియని వారు కావడం కాస్త ఇబ్బంది పెట్టే అంశమే. ఈ చిత్రం తెలుగు నేటివిటికి  ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

కాంతారా మూవీకి  కెమెరామెన్  అరవింద్ కశ్యప్ ఫోటోగ్రఫీ బాగుంది. అడివిలోని ప్రకృతి అందాలను చక్కగా తెరకపై ఆవిష్కరించాడు. అటు సంగీత దర్శకుడు అజనీజ్ లోక్‌నాథ్ ఆర్ఆర్‌తో పాటు సంగీతం బాగుంది. ఎడిటర్ ఉన్నంత బాగానే చేసాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా ఎక్కువగా అనవసర సన్నివేశాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  హోంబలే ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే.. 

ఈ చిత్రంలో రిషబ్ శెట్టి.. ఒక గ్రామీణ యువకుడు పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో దైవ నర్తకుడి (డేమి గాడ్) గా అతని నటనకు పీక్స్ అని చెప్పాలి. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో (కిషోర్)పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. హీరోయిన్‌గా నటించిన సప్తమి గౌడ తన పరిధి మేరకు నటించింది. గ్రామీణ అడవి యువతి పాత్రలో చక్కగా నటించింది.  మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు ఉన్నంతలో తమ పాత్రకు న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ 

క్లైమాక్స్

రిషబ్ నటన

రీ రికార్డింగ్

గ్రాఫిక్స్

మైనస్ పాయింట్స్ 

సాదా సీదా కథ

నేటివిటీ

చివరి మాట : ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ ‘కాంతారా’..

రేటింగ్ : 3/5

First published:

రేటింగ్

కథ:
3/5
స్క్రీన్ ప్లే:
3/5
దర్శకత్వం:
3/5
సంగీతం:
3/5

Tags: Kantara, Sandalwood, Tollywood

ఉత్తమ కథలు