హోమ్ /వార్తలు /సినిమా /

Kantara: కాంతార చివరిరోజు షూటింగ్ వీడియోను షేర్ చేసిన హీరోయిన్.. వైరల్..!

Kantara: కాంతార చివరిరోజు షూటింగ్ వీడియోను షేర్ చేసిన హీరోయిన్.. వైరల్..!

కాంతార క్లైమాక్స్ సన్నివేశంలో లీల గర్భవతిగా మనకు కనిపిస్తుంది. అలా చివరి రోజు షూట్‌లో సప్తమి గౌడ గర్భవతి గెటప్‌లో కనిపించింది.

కాంతార క్లైమాక్స్ సన్నివేశంలో లీల గర్భవతిగా మనకు కనిపిస్తుంది. అలా చివరి రోజు షూట్‌లో సప్తమి గౌడ గర్భవతి గెటప్‌లో కనిపించింది.

కాంతార క్లైమాక్స్ సన్నివేశంలో లీల గర్భవతిగా మనకు కనిపిస్తుంది. అలా చివరి రోజు షూట్‌లో సప్తమి గౌడ గర్భవతి గెటప్‌లో కనిపించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతార ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకగంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె... ఫారెస్ట్ గార్డ్‌గా నటించింది. అయితే కాంతార సినిమా షూటింగ్ మొత్తం నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వగ్రామంలో జరిగింది. కాంతార షూటింగ్ ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకాలోని కెరడిలో జరిగింది. తాజాగా కాంతార హీరోయిన్ సప్తమి గౌడ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాంతార సినిమా చివరి రోజు షూటింగ్ వీడియోను షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

కాంతార సినిమాతో లీలా అలియాస్ సప్తమి గౌడ ఇప్పుడు చాలా బిజీగా మారింది. లీలగా తన అద్భుతమైన నటనతో సప్తమి గౌడకు సినీ పరిశ్రమలో డిమాండ్ పెరిగింది. సప్తమి గౌడకు కన్నడలోనే కాకుండా ఇతర చిత్ర పరిశ్రమల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. సప్తమి గౌడ ప్రస్తుతం జూనియర్ రెబల్ స్టార్ అభిషేక్ అంబరీష్ తో ‘కాళి’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సప్తమి గౌడ మాత్రం ఇంకా కాంతార సినిమా నుంచి బయటకు రానట్లు కనిపిస్తోంది. సప్తమి గౌడ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాంతార సినిమా చివరి రోజు షూటింగ్ వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియోలో సప్తమి బన్ను తింటూ ఉండటం మనం గుర్తించవచ్చు. కాంతార క్లైమాక్స్ సన్నివేశంలో లీల గర్భవతిగా మనకు కనిపిస్తుంది. అలా చివరి రోజు షూట్‌లో సప్తమి గౌడ గర్భవతి గెటప్‌లో కనిపించింది. చేతిలో బన్ను పట్టుకుని, నెమ్మదిగా ఒక్కొక్క ముక్క తింటూ, మెల్లగా తిరుగుతూ ఉండటం మనం తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోలో గుర్తించవచ్చు.ఈ వీడియోను పోస్టు చేస్తూ.. సప్తమి కాస్త ఎమోషనల్ అయ్యింది. సప్తమి గౌడ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది. ‘కాంతార సెట్స్‌ను మిస్ అవుతున్నాను. రాత్రి షూటింగ్ సమయంలో నేను తిన్న బన్స్ అన్నీ మిస్ అవుతున్నాను. నేను నా టీంను మిస్ అవుతున్నాను. సెట్‌లో ఇదే నా చివరి రోజు షూటింగ్’ అని సప్తమి భావోద్వేగంతో రాశారు.

కాంతార కథ అంతా అడవిలోనే జరగడంతో ఈ సినిమాలో సప్తమి గౌడ లీలా అనే ఫారెస్ట్ గార్డ్ పాత్రను పోషించింది. సినిమాలో వేసుకున్న యూనిఫామ్ ని తన దగ్గరే ఉంచుకుంది. సప్తమి చెప్పినట్లుగా, తాను చాలా కాలం పాటు ఫారెస్ట్ గార్డు కాస్ట్యూమ్‌ను ధరించాను మరియు షూటింగ్ పూర్తయిన తర్వాత దానిని విడిచిపెట్టలేకపోయాను. కాబట్టి, లీలా తన బ్యాడ్జ్‌తో ఉన్న యూనిఫామ్‌ని ఇంటికి తీసుకెళ్లాలని తన కోరికను వ్యక్తం చేసినప్పుడు, రిషబ్ శెట్టి అందుకు సరే అన్నారంట.

First published:

Tags: Kantara, Rishab Shetty

ఉత్తమ కథలు