‘KGF’ మూవీ నుంచి మరో ట్రైలర్ విడుదల: మరో ఛత్రపతిగా యశ్

‘బాహుబలి’ సిరీస్‌తో దక్షిణాది చిత్ర పరిశ్రమ సత్తా ఏందో అందరికీ తెలిసింది. ఈ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమ అన్ని రికార్డులను తిరగరాసింది. యశ్ హీరోగా ‘కేజీఎఫ్’ అనే మూవీని కన్నడలో తెరకెక్కించారు. ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, చైనీస్, జపనీస్‌ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో ట్రైలర్‌ను విడుదల చేశారు

news18-telugu
Updated: December 5, 2018, 8:58 PM IST
‘KGF’ మూవీ నుంచి మరో ట్రైలర్ విడుదల: మరో ఛత్రపతిగా యశ్
కేజీఎఫ్‌లో యశ్
  • Share this:
‘బాహుబలి’ సిరీస్‌తో దక్షిణాది చిత్ర పరిశ్రమ సత్తా ఏందో అందరికీ తెలిసింది. ఈ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమ అన్ని రికార్డులను తిరగరాసింది. ఇపుడు అన్ని చిత్ర పరిశ్రమలు వాళ్ల వాళ్ల భాషల్లో భారీ చిత్రాలను నిర్మించే పనిలో పడ్డారు. ఆల్రెడీ ‘బాహుబలి’ కంటే ముందు శంకర్ తన సినిమాలతో దక్షిణాది సినిమాల పవర్ ఏంటో చూపించాడు.

ఇపుడు మలయాళ చిత్ర పరిశ్రమలో మోహన్ లాల్ హీరోగా వెయ్యికోట్లతో ‘మహాభారతం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకోవైపు విక్రమ్ హీరోగా రూ.300 కోట్లతో ‘మహావీర్ కర్ణ’ పేరుతో సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు కన్నడలో ‘కురుక్షేత్ర’ పేరుతో భారీ పౌరాణిక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీతో పాటు యశ్ హీరోగా ‘కేజీఎఫ్’ అనే మూవీని కన్నడలో తెరకెక్కించారు. ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, చైనీస్, జపనీస్‌ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇన్ని భాషల్లో విడుదల కాబోతున్న ఫస్ట్ కన్నడ మూవీ ఇదే. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.





తాజాగా ఈ మూవీ నుంచి మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. పవర్‌ఫుల్ మనుషులు పవర్ఫుల్ ప్లేసెస్ నుంచి వస్తారనే డైలాగులు బాగున్నాయి. ఈ మూవీలో యశ్ రఫ్‌ లుక్‌లో అలరించాడు. తెలుగులో ఈ మూవీని వారాహీ చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి సీనియర్ టాలీవుడ్ నటుడు కైకాల సత్యనారాయణ చాలా కాలం తర్వాత  వ్యవహరిస్తున్నారు.

ఈ మూవీని 1950, 70 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు.ఈ మూవీలో యశ్ ముంబాయి మురికివాడలో పుట్టి చిన్నా చితక పనులు చేసుకుంటూ కోలార్ బంగారు మైన్లకు అధిపతి అవుతాడు. ఈ నేపథ్యంలో అతను ఎదురైన అనుభవాలు, సంఘటనల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.‘కేజీఎఫ్’ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని కోలార్ బంగారు గనుల్లో చిత్రీకరించారు. కన్నడ చిత్ర సీమలో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీని ‘బాహుబలి’, ఎన్టీఆర్’ సినిమాల మాదిరే రెండు భాగాలులగా తెరకెక్కించారు. మొదటి భాగాన్ని డిసెంబర్ 21న కన్నడతో పాటు అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.  మరి ఈ మూవీ అన్ని భాషల్లో ఒకే రకమైన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ.


ఇది కూడా చదవండి 

భారత్‌లో మునిగిన ఆమీర్ నావ..చైనాలో తేలుతుందా..!

సినిమాగా సర్జికల్ స్ట్రయిక్: ట్రైలర్ చూస్తే హాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Forbes India Celeb 100: సౌత్‌లో రజినీకాంత్.. తెలుగులో పవన్ కళ్యాణ్ టాప్..

 
First published: December 5, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు