Home /News /movies /

KANNADA STAR HERO KICHHA SUDEEP COMMENTS ON HINDI LANGUAGE SB

Sudeep:హిందీ భాషపై.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

కిచ్చా సుదీప్

కిచ్చా సుదీప్

ప్రపంచం మొత్తం చూసేలా సౌత్ డైరెక్టర్స్ తమ సినిమాలను రూపొందిస్తున్నారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుదీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

    భారతదేశం అనేక భాషాల,సంస్కృతల సమ్మేళనం. ఎన్ని సంప్రదాయాలు ఆచారాలు ఉన్నా కూడా భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు మతం, భాష అంటూ పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేసినా.. అవి అప్పటివరకు తమ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఒకే భాష ఒకే దేశం అన్న నినాదం కూడా కొందరు రాజికీయ నేతలు తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై పొలిటికల్ లీడర్స్‌తో పాటు.. పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇటీవల కేంద్రమంత్రి అమిత్ షా హిందీ అందరూ నేర్చుకోవాలంటూ.. కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు సెలబ్రిటీలు కూడా తమదైన స్టైల్లో స్పందించారు.

    తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ హిందీ భాషను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. సుదీప్ తాజాగా కెజిఎఫ్ 2 సినిమాపై ప్రశంసలు వర్షం కురిపించాడు. అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో ప్రస్తుతం సుదీప్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదన్నారు సుదీప్. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ” ఓ కన్నడ సినిమాను పాన్ ఇండియాగా రూపొందించారని అందరూ అంటున్నారు. కానీ అందులో ఒక చిన్న కరెక్షన్ హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తుంది. వాటిని తెలుగు, తమిళ్  భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ అవి హిట్ అవుతున్నాయా అంటే లేదు. ఎంతమాత్రం అవి విజయం సాధించలేకపోతున్నాయి.

    కానీ.. ఈరోజు మనం తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రపంచం మొత్తం చూస్తున్నాయి. ప్రపంచం మొత్తం చూసేలా సౌత్ డైరెక్టర్స్ తమ సినిమాలను రూపొందిస్తున్నారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుదీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవలే మన సౌత్ సినిమాలు బాహుబలి,ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ పాన్ ఇండియాలో ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో తెలిసిందే.

    కిచ్చ సుదీప్  తెలుగులో ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు విలన్ గా పరిచయమైన ఆ తరువాత సైరా నరసింహారెడ్డి లో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు. కన్నడలో స్టార్ హీరో అయినా పాత్ర నచ్చితే అతిధి పాత్రలోనైనా కనిపిస్తాడు. ఇక దీంతోనే సుదీప్ కు టాలీవుడ్ లో కూడా  మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే ప్రస్తుతం సుదీప్ విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Kiccha sudeep, Sudeep, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు