Home /News /movies /

Director Nagesh Babu: సీనియర దర్శకుడు కన్నుమూత.. ఇండస్ట్రీలో మరో విషాదం..

Director Nagesh Babu: సీనియర దర్శకుడు కన్నుమూత.. ఇండస్ట్రీలో మరో విషాదం..

కన్నడ దర్శకుడు నగేష్ బాబు కన్నుమూత (kannada director nagesh babu death)

కన్నడ దర్శకుడు నగేష్ బాబు కన్నుమూత (kannada director nagesh babu death)

Director Nagesh Babu: తెలుగు, తమిళ, కన్నడ అని తేడా లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు మంచి రోజులు కాదు.. జరుగుతున్న పరస్థితులు చూస్తుంటేనే ఇది అర్థమవుతుంది.

తెలుగు, తమిళ, కన్నడ అని తేడా లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు మంచి రోజులు కాదు.. జరుగుతున్న పరస్థితులు చూస్తుంటేనే ఇది అర్థమవుతుంది. ప్రతీ రెండు మూడు రోజులకు ఒకసారి ఎవరో ఒకరు చనిపోతున్నారనే వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా కన్నడ సీనియర్ దర్శకుడు నగేష్ బాబు కన్నుమూశాడు. ఈయన వయసు 82 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వయోభారంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు నగేష్ బాబు. దాంతో ఆయనను ఈ మధ్యే బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్టోబర్ 6 సాయంత్రం తుదిశ్వాస విడిచాడు. నగేష్ మరణవార్తను కుటుంబ సభ్యులు తెలియజేసారు. నగేష్ మరణంతో కన్నడనాట విషాద ఛాయలు అలుముకున్నాయి.
కన్నడ దర్శకుడు నగేష్ బాబు కన్నుమూత (kannada director nagesh babu death)
కన్నడ దర్శకుడు నగేష్ బాబు కన్నుమూత (kannada director nagesh babu death)

అక్కడ ఆయనకు మంచి దర్శకుడిగా పేరుంది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో జన్మించిన నగేష్.. ప్రేమాడ పుత్రి అనే సినిమతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. తూగుదీప, నన్న కర్తవ్య వంటి హిట్ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు అనిరీక్షిత అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. అంతేకాదు బెంగళూరులోని గాంధీ నగర్ ప్రగతి అనే పేరుతో ఓ స్టూడియోను కూడా నిర్మించారు నగేష్ బాబు. 2009లో ఆయన రూపొందించిన తత్వమసియు ఆర్ అనే ఇంగ్లీష్ డాక్యుమెంటరీ పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితమైంది. అది ఆయనకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. నగేష్ మరణంపై కన్నడ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kannada Cinema, Sandalwood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు