వెండితెరపై మరో భారీ మహా భారతం.. ‘కురుక్షేత్రం’ ట్రైలర్ విడుదల..

యాక్షన్ కింగ్ అర్జున్, దర్శన్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ‘కురుక్షేత్రం’ మూవీ (ట్విట్టర్ ఫోటోస్)

ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు చూసిన తనివీ తీరని ఇతిహాసం మహాభారతం. ఇప్పటి వరకు మన ఫిల్మ్ మేకర్స్ మహా భారతాన్ని ఎన్నో విధాలుగా తెరకెక్కించిన ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. తాజాగా కన్నడ ఫిల్మ్ మేకర్స్.. నాగన్న శాండిల్ వుడ్‌లో అత్యధిక బడ్జెట్‌‌‌తో ‘కురుక్షేత్ర’ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాను తెలుగులో ‘కురుక్షేత్రం’ టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు.

 • Share this:
  ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు చూసిన తనివీ తీరని ఇతిహాసం మహాభారతం. ఇప్పటి వరకు మన ఫిల్మ్ మేకర్స్ మహా భారతాన్ని ఎన్నో విధాలుగా తెరకెక్కించిన ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. తాజాగా కన్నడ ఫిల్మ్ మేకర్స్.. నాగన్న శాండిల్ వుడ్‌లో అత్యధిక బడ్జెట్‌‌‌తో ‘కురుక్షేత్ర’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను వివిధ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘కురుక్షేత్రం’ టైటిల్‌తో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తాజాగా  ఈసినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు.  ఈ సినిమాను మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ద నేపథ్యంలో పూర్తి 3Dలో  తెరకెక్కించారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో కన్నడ ఇండస్ట్రీలో 70వ దశకం నుంచి  ఈ దశకం వరకు వచ్చిన ఉన్న అగ్ర కన్నడ నటీనటులు  ఈ సినిమాలో యాక్ట్ చేసారు.

  ముఖ్యంగా 70వ దశకానికి చెందిన అంబరీష్ ఈ సినిమాలో భీష్మ పితామహుడిగా నటించాడు. నటుడిగా అంబరీష్ చివరి సినిమా ఇదే. యాదృచ్చికంగా ఈ సినిమాలో కూడా ఆయన చనిపోయే భీష్ముడి పాత్రను పోషించడం కాకతాళీయమనే చెప్పొచ్చు. మరోవైపు 80లో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో కర్ణుడి పాత్రను పోషించాడు. మరోవైపు మరో సీనియర్ హీరో రవిచంద్రన్ ఈ సినిమాలో శ్రీ కృష్ణుడి పాత్రను పోషించాడు. మరోవైపు 90వ దశకానికి చెందిన దర్శన్.. దుర్యోధనుడి పాత్రను పోషించాడు. ఇంకోవైపు ఈ దశాబ్ధానికి చెందిన నిఖిల్ గౌడ ..అభిమన్యుడి పాత్రలో నటించాడు. మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ సినిమాలో అర్జునుడి క్యారెక్టర్ వేసాడు.

  భారీ బడ్జెట్‌తో కన్నడలో తెరకెక్కిన ‘కురుక్షేత్రం’ మూవీ


  మరోవైపు సినిమాలో కీలకమైన ద్రౌపది పాత్రలో స్నేహ నటించింది. ఇక శకునిగా బొమ్మాళీ రవిశంకర్ యాక్ట్ చేసాడు. మిగిలిన ముఖ్యపాత్రల్లో సౌత్ సినిమా స్టార్స్ అంతా యాక్ట్ చేసారు. ఈ చిత్ర పోస్ట‌ర్స్.. టీజ‌ర్స్ అన్నీ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఒక్క‌రు ఇద్ద‌రూ కాదు.. సినిమా అంతా స్టార్స్ క‌నిపిస్తుండ‌టంతో సినిమా కూడా సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎప్పుడో ఓ సారి క‌చ్చితంగా రాజ‌మౌళి తెర‌కెక్కించాలనుకున్న క‌ల‌ల ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు క‌న్న‌డ ద‌ర్శ‌కుడు నాగ‌న్న ముందే తెర‌కెక్కించాడు. ఈ సినిమాను ఆగష్టు 9న కన్నడలో విడుదల చేయనున్నారు. మిగతా భాషల్లో అదే తేదిన విడుదల చేస్తారా అనేది చూడాలి. ఈ సినిమాను కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న తెరకెక్కించాడు. రాక్‌లైన్ వెంకటేష్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో గతంలో కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు ముఖ్యపాత్రలో ‘కురుక్షేత్రం’ పేరుతో ఒక పౌరాణిక సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా.

  SS Rajamouli dream project Mahabharatam getting ready to release in Kannada as Kurukshetra pk.. రాజ‌మౌళి క‌ల‌ను క‌న్న‌డ ద‌ర్శ‌కుడు చెద‌ర‌గొట్ట‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇంత‌కీ ఏ విష‌యంలో రాజ‌మౌళి క‌ల చెదిరింది అనుకుంటున్నారా.. kurukshetra kannada movie,kurukshetra,kurukshetra movie,kurukshetra trailer,kurukshetra teaser,kurukshetra darshan,kurukshetra new kannada movie,kurukshetra kannada movie trailer,muniratna kurukshetra kannada movie,muniratna kurukshetra kannada movie 2019,new kannada movie,darshan kurukshetra,kurukshetra kannada,kurukshetra kannada movie cast leaked,kurukshetra movie trailer,kannada kurukshetra movie cast,ss rajamouli,rajamouli,ss rajamouli interview,mahabharata,mahabharat,ss rajamouli mahabharat,ss rajamouli about mahabharata,ss rajamouli latest interview,mahabharat movie,rajamouli mahabharat,rajamouli mahabharata dream cast,rajamouli mahabharata characters,mahabharatham,ss rajamouli dream project,mahabharat trailer ss rajamouli,ss rajamouli mahabharata,aamir khan mahabharat,director ss rajamouli,ss rajamouli mahabaratham,telugu cinema,కురుక్షేత్ర,రాజమౌళి మహాభారతం,కురుక్షేత్ర కన్నడ సినిమా,తెలుగు సినిమా,మహాభారతం తెలుగు సినిమా
  కురుక్షేత్ర పోస్టర్


  మరోవైపు మలయాళంలో కూడా మోహన్ లాల్ ప్రధాన పాతర్లో ‘రండమూలం’ నవలా ఆధారంగా భీముని యాంగిల్‌లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మరో మహాభారతం రూ.1000 కోట్లతో తెరకెక్కనుంది. ఇంకోవైపు రాజమౌళి కూడా మహాభారతం తెరకెక్కించడం తన జీవిత ధ్యేయమని చెప్పాడు.మొత్తానికి ఇపుడు కన్నడ దర్శకుడు తెరకెక్కించిన ఈ మహాభారతం దక్షిణాదిన ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
  First published: