#MeToo : ‘మీ టూ’ సుడిగుండంలో నటుడు అర్జున్‌!

ఓ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ అభ్యంతరకరమైన రీతిలో తనతో ప్రవర్తించినట్లు సృతి హరిహరన్ సోషల్ మీడియాలో వెల్లడించింది.

news18-telugu
Updated: October 20, 2018, 9:54 PM IST
#MeToo : ‘మీ టూ’ సుడిగుండంలో నటుడు అర్జున్‌!
సినీ నటుడు అర్జున్
news18-telugu
Updated: October 20, 2018, 9:54 PM IST
‘మీ టూ’ ఉద్యమం కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇప్పటికే తమిళ కవి వైరముత్తు‌కు మీ టూ మరక అంటుకోగా...తాజాగా మరో సినీ ప్రముఖుడు అర్జున్ ఈ వివాదంలో చిక్కుకున్నారు. అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు కన్నడ నటి శృతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసింది. తాము జంటగా నటించిన ‘నిపుణన్’ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ అభ్యంతరకరమైన రీతిలో తనతో ప్రవర్తించినట్లు ఆమె ట్విట్టర్‌లో నాలుగు పేజీల ప్రకటనను పోస్ట్ చేసింది. అభ్యంతరకరమైన రీతిలో తనను తాకడంతో తాను షాక్‌కు గురైనట్లు తెలిపారు. అర్జున్ ప్రవర్తన తనకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని, అయితే దీన్ని బహిరంగంగా చెప్పే దైర్యం అప్పట్లో తనకు లేదని శృతి తెలిపింది. మీ టూ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన శృతి...లైంగిక వేధింపులకు గురైన అందరూ తమ చేదు అనుభవాన్ని బయటపెట్టాలని సూచించారు.

శృతి హరిహరన్
శృతి హరిహరన్




అయితే తనపై శృతి హరిహరన్ చేసిన వేధింపుల ఆరోపణలను అర్జున్ తోసిపుచ్చారు. తనపై ఆరోపణలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణల కారణంగా మీ టూ ఉద్యమం బలహీనపడే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.
First published: October 20, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...