చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ యువనటి ఆత్మహత్య చేసుకోవడం కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. సౌజన్య (Kannada actress Soujanya) అనే యువతి శాండల్వుడ్లు పలు చిత్రాల్లో, సీరియల్స్‌లో నటించింది. కొడగు జిల్లాలోని కుశలనగర్ ఆమె స్వస్థలం. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని (Bengaluru) కుంబల్‌గోడులోని తన అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. అయితే ఆమె ఆ అపార్ట్మెంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్న ఆమె ప్రాణాలు తీసుకుంది. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ గదిని బలవంతంగా తెరిచి చూడగా.. ఆమె ఉరి వేసుకుని కనిపించింది. ఆమె కాలుపై ఉన్న టాటూ ఆధారంగా ఆ మృతదేహం సౌజన్యదేనని పోలీసులు గుర్తించారు.
ఇక, సౌజన్య ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె సహచరులను, కుటుంబ సభ్యులను నుంచి మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఆమె మృతదేహం వద్ద నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో సెప్టెంబర్ 27న రాసినట్టుగా దానిపై ఉన్న డేట్‌ను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితమే ఆమె ప్రాణాలు తీసుకుని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనంతరం ఆమె మృతదేహాన్ని రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్‌కి (Rajarajeshwari Medical College) తరలించారు.
అయితే తన మృతికి ఎవరూ కారణం కాదని సౌజన్య ఆ సూసైడ్ నోట్లో పేర్కొంది. తన తల్లిదండ్రులకు క్షమాపణలు కోరింది. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపింది. అయితే తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలతో మానసికంగా బాధపడుతున్నట్టుగా తెలిపింది. తనకు సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది. ఇక, ఈ వార్త కన్న చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. డిప్రెషన్ కారణంగా సౌజన్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమె మృతిపట్ల పలువురు టీవీ, సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
కొద్ది నెలల కిందట జయశ్రీ రామయ్య..
కొన్ని నెలల కిందట యువనటి, బిగ్‌బాస్ కన్నడ సీజన్ 3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య (Jayashree Ramaiah) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జయశ్రీ కూడా మానసిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు తీసుకున్నట్టుగా సన్నిహితులు చెప్పుకొచ్చారు. అయితే ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇందుకు బలం చేకూర్చాయి. అయితే వరుసగా యువ నటీమణులు ఇలా ఆత్మహత్య చేసుకోవడం కన్నడ చిత్ర పరిశ్రమలో (Kannada Film Industry) తీవ్ర కలకలం రేపుతోంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.