హోమ్ /వార్తలు /సినిమా /

sanjana galrani: నా జీవితంలో బ్యాడ్ లక్ నడుస్తుందంటున్న సంజన.. ఈసారి భర్త కూడా ఆ సమస్యలో?

sanjana galrani: నా జీవితంలో బ్యాడ్ లక్ నడుస్తుందంటున్న సంజన.. ఈసారి భర్త కూడా ఆ సమస్యలో?

అడిగితే అనుకోకుండా జరిగిపోయింది.. తర్వాత పిలిచి పార్టీ ఇవ్వాలనుకున్నా కూడా కుదర్లేదు అంటూ సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఇప్పుడు భర్త అజీజ్‌ పాషాతో విడిపోవడానికి ఈమె నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అడిగితే అనుకోకుండా జరిగిపోయింది.. తర్వాత పిలిచి పార్టీ ఇవ్వాలనుకున్నా కూడా కుదర్లేదు అంటూ సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఇప్పుడు భర్త అజీజ్‌ పాషాతో విడిపోవడానికి ఈమె నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

sanjana galrani: సినీ నటి సంజన గల్రాని డ్రగ్స్ కేసులో ఇరుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె.. గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది.

  sanjana galrani: సినీ నటి సంజన గల్రాని డ్రగ్స్ కేసులో ఇరుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె.. గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. ఈమెతో పాటు మరో కన్నడ హీరోయిన్ కూడా ఈ కేసులో ఉండగా గత ఏడాది సెప్టెంబర్ నెలలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వాళ్లని అరెస్టు చేశారు. ఆ తర్వాత తన అనారోగ్య సమస్య పట్ల కొన్ని షరతులతో బెయిల్ మంజూరుపై బయటకు వచ్చింది.

  ఇక ఈమె రహస్యంగా కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త, డాక్టర్ పాషాను పెళ్లి చేసుకుంది. అతి తక్కువ సంఖ్యలో బంధుమిత్రులతో పెళ్లి చేసుకోగా.. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆమె పెళ్లి ఫోటోలను పంచుకోగా అవి వైరల్ గా మారాయి. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆత్మ నిర్భర్ పేరుతో నటీనటుల్లో ఆత్మ స్థైర్యాని నింపే ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇక గతంలో జరిగిన సంఘటన నుండి మెళ్ళగా బయటకు వస్తున్న తరుణంలో మరో చేదు అనుభవం ఎదురయింది సంజనకు.

  ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గురించి అందరికీ తెలిసిందే. ఇక అమె ఇటీవలే కరోనా బారిన పడగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న సమస్యల గురించి పంచుకుంది. ఆమె వ్యక్తిగతంగా, వృత్తిపరంగా గతేడాది నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట‌. బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే ఈ నూతన సంవత్సరంలో జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని అనుకుందట. ఇంతలో ఆమె కరోనా బారిన పడగా.. త్వరలోనే ఈ వైరస్ నుండి కోలుకోవడానికి ఆశిస్తున్నానని తెలిపింది.

  ఇక తన భర్త, తను చిన్నప్పటి నుంచి స్నేహితులమంటూ, అలా తమ స్నేహం ప్రేమగా మారి ఎవ్వరికి తెలియకుండా అతి తక్కువ సమక్షంలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ఇక తన భర్త కోవిడ్ బాధితులకు చికిత్స అందించి వస్తున్నాడని, ఏదో ఒక రోజు తాము కూడా వైరస్ బారిన పడే అవకాశాలున్నాయని ముందే ఊహించుకుందట. ఇక తన దిగులంతా అతని ఆరోగ్యం గురించేనని, ఇప్పుడు తను కొద్దిగా ఆరోగ్యంగానే ఉన్నానంటూ తెలిపింది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Corona virus, Covid-19, Drug case, Kannada actress, Sanjana galrani, Sushanth singh Rajputh, Tollywood

  ఉత్తమ కథలు