Home /News /movies /

Ragini Arrested: డ్రగ్స్ కేసులో హీరోయిన్ అరెస్టు

Ragini Arrested: డ్రగ్స్ కేసులో హీరోయిన్ అరెస్టు

రాగిణి ద్వివేది

రాగిణి ద్వివేది

Ragini Dwivedi Drug Case: డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేదీ అరెస్టయ్యారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు శాండిల్‌వుడ్ హీరోయిన్‌ను అరెస్ట్ చేశారు.

    Ragini Dwivedi Arrest: డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేదీ అరెస్టయ్యారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు శాండిల్‌వుడ్ హీరోయిన్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి బెంగళూరులోని రాగిణి నివాసంలో సోదాలు చేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి బుధవారం రోజు పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరారు. అయితే, ఆ తర్వాత రోజే ఆమె తనకు సోమవారం వరకు సమయం కావాలంటూ తన న్యాయవాదుల ద్వారా విజ్ఞప్తి చేసింది. దీంతో సీసీబీ అధికారులు ఆమెను శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈరోజు విచారణకు హాజరైన ఆమెను అధికారులు విచారించారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. బెంగళూరులోని రాగిణి నివాసంలో అధికారులు సోదాలు జరపగా, వారికి గంజాయి దొరికనట్టు తెలిసింది. అందుకే, ఆమెను అరెస్టు చేసినట్టు భావిస్తున్నారు. 2009 సంవత్సరంలో వీర మదకరి సినిమాతో రాగిణి తెరంగేంట్రం చేసింది. ఆ తర్వాత కెంపే గౌడ, రాగిణి ఐపీఎస్, బంగారి, శివ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.

    రాగిణి ద్వివేదీ అరెస్టు (Photos by Amlan Paliwal)


    ఆగస్టు 21 ఓ డ్రగ్స్ సప్లయర్ అరెస్ట్ కావడంతో.. శాండల్ వుడ్ లింకులు బయటపడ్డాయి. అతడి డైరీలో కన్నడ చిత్రసీమకు చెందిన పలువురు పేర్లు ఉండడంతో సంచలనంగా మారింది. ఇప్పటికే హీరోయిన్ రాగిణి ఫ్రెండ్ రవి శంకర్ అరెస్ట్ అయ్యాడు. అతడి విచారణలో కీలక వివరాలను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కూపీ లాగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రాగిణి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు పోలీసులు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

    రాగిణి ద్వివేదీ అరెస్టు (Photos by Amlan Paliwal)


    ఆగస్టు 21న బెంగళూరు శివారులోని రాయల్ సూట్స్ హోటల్‌లో NCB అధికారులు సోదాలు చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ 145 MDMA పిల్స్‌, రూ.2.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పలువురి అరెస్ట్‌ చేసి విచారించగా మరికొందరి లింకులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఆగస్టు 26న కన్నడ టెలివిజన్ మాజీ నటి డి. అంకితతో పాటు రవిచంద్రన్, అనూప్‌ను అరెస్ట్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Kannada Cinema

    తదుపరి వార్తలు