ప్రముఖ నటుడు సత్యజిత్ కన్నుమూత -కామెర్లు, గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి కోలుకోకుండానే..

నటుడు సత్యజిత్ కన్నుమూత

Kannada actor Satyajit passes away : ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ (71) కన్నుమూశారు. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన బెంగళూరులోని బోరింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. సాయి కుమార్ ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో బ్యాడ్ కాప్ గా తెలుగువారికీ సత్యజిత్ పరిచితుడయ్యారు..

  • Share this:
దక్షిణాది సినీ రంగం మరో సీనియర్ నటుణ్ని కోల్పోయింది. కన్నడతోపాటు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగువారికీ పరిచయమున్న ప్రఖ్యాత నటుడు సత్యజిత్ ఇక లేరు. 71ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఆదివారం మరణించారు. బెంగళూరులోని బోరింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారని డాక్టర్లు, కుటుంబీకులు తెలిపారు. సత్యజిత్ మృతితో కర్ణాటకలోని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కన్నడ నటుడు సత్యజిత్ కు చాలా రోజుల కిందట కామెర్లు సోకాయి. ఆ వ్యధితో బాధపడుతుండగానే గుండెపోటుకు గురయ్యారు. దాంతో కుటుంబీకులు ఆయనను బెంగళూరులోని ప్రఖ్యాత బోరింగ్ ఆస్పత్రి ఐసీయూ విభాగంలో ఉంచి చికిత్స అందించారు. బీపీ, షుగర్ అసాధారణ స్థాయిలో కొనసాగడంతో సత్యజిత్ కోలుకోలేకపోయారు. గడిచిన వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చివరికి ఇవాళ తుది శ్వాస విడిచారు.

సినీ రంగంలో సుదీర్ఘ ప్రస్థానం సాగించినప్పటికీ ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో సత్యజిత్ చికిత్సకు అయ్యే ఖర్చులు భరించాల్సిందిగా కన్నడ ఫిలిం ఛాంబర్, కర్నాటక ప్రభుత్వాన్ని ఆయన కుటుంబీకులు వేడుకున్నారు. అటు నుంచి స్పందన వెలువడేలోపే పెద్దాయన ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. కాంగ్రెస్ పార్టీతోనూ సత్యజిత్ కు అనుబంధం ఉంది.

సత్యజిత్ అసలు పేరు సయ్యద్ నిజాముద్దీన్. 650కిపైగా కన్నడ సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతోపాటు నెగటివ్ పాత్రల్లోనూ నటించారు. అరుణరాగా, ఫైనల్ వెర్డిక్ట్, శివ అప్రిసియేటెడ్ కన్నప్ప, రంగరంగ, నమ్ముర రాజా, జస్టిస్ ఫర్ మి, మాండ్యాస్ మేల్, పోలీస్ స్టోరీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, పటేల్, దుర్గా టైగర్ తదితర హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ సూపర్ హిట్టయిన పోలీస్ స్టోరీలో బ్యాడ్ పోలీస్ గా సత్యజిత్ పాత్ర అందరికీ గుర్తుంటుంది.
Published by:Madhu Kota
First published: