Rockline Sudhakar Passes Away : మరో కమెడియన్ మృతి... విషాదంలో సినీ ఇండస్ట్రీ..

Rockline Sudhakar Passes Away : కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రసిద్ధ హాస్యనటులలో ఒకరైన రాక్‌లైన్ సుధాకర్ కన్నుమూశారు.

news18-telugu
Updated: September 24, 2020, 2:05 PM IST
Rockline Sudhakar Passes Away : మరో కమెడియన్ మృతి... విషాదంలో సినీ ఇండస్ట్రీ..
కమెడియన్ రాక్‌లైన్ సుధాకర్ Photo : Twitter
  • Share this:
కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రసిద్ధ హాస్యనటులలో ఒకరైన రాక్‌లైన్ సుధాకర్ కన్నుమూశారు. ఆయన ఈరోజు ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా గుండెపోటుతో మరణించారు. ఇటీవల, నటుడు రాక్‌లైన్ సుధాకర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే తరువాత అతను ఆసుపత్రిలో చేరాడు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత ఎంతో చురుకుగా ఉన్న సుధాకర్ గుండెపోటుతో ఈ ఉదయం మరణించాడు. ఈ ఘటన సినీ పరిశ్రమకు, అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కన్నడ సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆయనకు సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఆయనతో తమ అనుబందాన్ని పంచుకుంటున్నారు. రాక్ లైన్ సుధాకర్ అజిత్, ఉడుంబా, తోపివాలా, జూమ్, చమక్, బాణసంచాతో సహా 50 కి పైగా చిత్రాల్లో నటించారు. తన విలక్షణమైన కామెడీ శైలితో హాస్య పాత్రల ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు సుధాకర్.

ఇక తాజాగా తెలుగులో కూడా ప్రముఖ కమెడియన్ కోసూరి వేణుగోపాల్ కరోనాతో మరణించాడు. కోసూరి వేణుగోపాల్ రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాడు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్న వేణుగోపాల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 23న ఈయన కన్నుమూశారు. మర్యాద రామన్న సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించాడు వేణుగోపాల్. కాగా ఇటీవల దర్శకుడు రాజమౌళికి కూడా..  కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మరో దర్శకుడు తేజ కూడా తనకు పాజిటివ్‌ వచ్చినట్టుగా తెలిపాడు. మొన్న పాప్ సింగర్ స్మిత కూడా కరోనా బారిన పడినట్టుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆ మహమ్మారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. ఇక ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
Published by: Suresh Rachamalla
First published: September 24, 2020, 2:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading