Home /News /movies /

Dhruva Sarja: ప్రముఖ కన్నడ హీరో ధృవ సర్జకు కరోనా పాజిటివ్..

Dhruva Sarja: ప్రముఖ కన్నడ హీరో ధృవ సర్జకు కరోనా పాజిటివ్..

ప్రముఖ నటుడు ధృవ సర్జకు కరోనా పాజిటివ్ (File/Photo)

ప్రముఖ నటుడు ధృవ సర్జకు కరోనా పాజిటివ్ (File/Photo)

Dhruva Sarja Corona Possitive | ప్రస్తుతం కరోనా మహామ్మారి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. దీనికి బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా లేదు. అందిరినీ కమ్మేస్తోంది. తాజాగా ప్రముఖ కన్నడ హీరో ధృవ సర్జకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

  ప్రస్తుతం కరోనా మహామ్మారి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. దీనికి బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా లేదు. అందిరినీ కమ్మేస్తోంది. ఇప్పటికే ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోవిడ్ బారిన పడటంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీంతో పాటు రేఖ ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్‌తో పాటు.. సారా అలీ ఖాన్ డ్రైవర్ సహా, పలువురు ఇప్పటికే ఈ మహామ్మారి బారిన పడ్డారు. దీంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీని కరోనా కమ్మేసింది. అటు కన్నడ సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు దీని బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ హీరో ధృవ సర్జ కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా అస్వస్థతగా ఉన్న ఈయన టెస్ట్ చేయించుకోవడంతో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన డాక్టర్ల సలహాతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈయన రీసెంట్‌గా కన్నుమూసిన చిరంజీవి సర్జకు స్వయానా తమ్ముడు. మరియు యాక్షన్ కింగ్ అర్జున్‌కు మేనల్లుడు అవుతాడు. మొన్నటి మొన్నచిరంజీవి సర్జ మరణంతో కృంగిపోయిన వీళ్ల ఫ్యామిలీకి ఇపుడు కరోనా కాటు వేసింది. కరోనా నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్ధిస్తున్నారు. మొత్తంగా ధృవ సర్జకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కన్నడ చిత్ర సీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Corona virus, Covid-19, Dhruva Sarja, Kannada Cinema, Sandalwood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు