• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KANNADA 36 YEAR OLD DIRECTOR NAVEEN AND TAMIL PRODUCER MUTHU KUMARAN DIES SAME DAY DUE TO COVID 19 PK

COVID deaths: కరోనా కాటు.. ఒకేరోజు ఓ నిర్మాత.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

COVID deaths: కరోనా కాటు.. ఒకేరోజు ఓ నిర్మాత.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

కరోనా మరణాలు (COVID deaths)

COVID deaths: కరోనా కాటుకు చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ప్రముఖులు కన్నుమూస్తూనే ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు సినీ ప్రముఖులు మరణించారు. కన్నడలో 36 ఏళ్ళ యువ దర్శకుడు.. తమిళంలో ఓ యువ నిర్మాత కరోనా కాటుకు ఒకే రోజు బలైపోయారు.

  • Share this:
కరోనా కాటుకు చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ప్రముఖులు కన్నుమూస్తూనే ఉన్నారు. రోజుకు కనీసం ఓ చేదు వార్త వింటూనే ఉన్నాం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోనూ చాలా మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు కూడా మరో ఇద్దరు సినీ ప్రముఖులు మరణించారు. కన్నడలో 36 ఏళ్ళ యువ దర్శకుడు.. తమిళంలో ఓ యువ నిర్మాత కరోనా కాటుకు ఒకే రోజు బలైపోయారు. సెకండ్ వేవ్‌లో చాలా మంది ప్రముఖులు మనకు శాశ్వతంగా దూరం అవుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇద్దరు ప్రముఖులు ఒకేరోజు దూరం అయ్యారు. ముఖ్యంగా త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా పంజా విసురుతుంది. కొన్ని రోజుల కిం వివేక్ వ్యాక్సిన్ వేయించుకున్న మరుసటి రోజే మరణించారు. అయితే ఆయన మరణం కరోనాతో కాదని తేల్చారు వైద్యులు. కానీ ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ మాత్రం కరోనాతోనే కన్నుమూసారు. తాజాగా నిర్మాత ముత్తు కుమ‌రన్ క‌రోనాతో క‌న్నుమూశారు. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన అత‌నికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ అని తేలింది. చాలా వేగంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. పరిస్థితి విషమించడంతో ముత్తు కుమరన్ మరణించారు. ఈ మధ్యే కృష్ణ‌, స్వాతి జంట‌గా యాగై అనే చిత్రాన్ని నిర్మించారు ముత్తు. అత‌నికి భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు.

ఇదిలా ఉంటే కన్నడలో కూడా ఓ కుర్ర దర్శకుడు కన్నుమూసారు. అతడి పేరు నవీన్. కేవలం 36 ఏళ్ళ వయసులోనే ఈయనకు నూరేళ్లు నిండిపోయాయి. అక్కడ వన్ డే ఇన్ 2011 సినిమాతో పరిచయమై.. మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నవీన్. అప్పు వెంకటేష్, రేవన్న ఈ సినిమాలో నటించారు. తాజాగా రెండో సినిమాకు కథ సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే కరోనా ఈయన్ని కాటేసింది. ఒకేరోజు ఇద్దరు చిన్న వయసులోనే కరోనాతో చనిపోవడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు