50 దేశాల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న కంగనా మణికర్ణిక

మణికర్ణిక (ట్విట్టర్ ఫోటో)

kangana Manikarnika | ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ‘మణికర్ణిక’ ఒకటి. కంగనా రనౌత్..ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మణికర్ణిక’ సినిమా  రిపబ్లిక్ డే కానుకగా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. 

  • Share this:
ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ‘మణికర్ణిక’ ఒకటి. కంగనా రనౌత్..ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మణికర్ణిక’ సినిమా  రిపబ్లిక్ డే కానుకగా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది.

ఈ చారిత్రక బయోపిక్‌ను క్రిష్‌తో కలిసి కంగనా రనౌత్ డైరెక్ట్ చేసింది. ఇప్పటికే భారత రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులకు ఈ చిత్ర బృందం ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. వాళ్లందరు  ఈచిత్రాన్ని చూసి అభినందించారు. ఈ సినిమకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందించారు.

ఈ సినిమాలో భారత వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయిగా కంగనా ఆహార్యం బాగుంది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళంలో 50 దేశాల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు.

అకింతా లోఖండే ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాకు శంకర్ ఎహ‌సాన్ లాయ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోతో కలిసి కమల్ జైన్ తెరకెక్కించారు. మరి ఈ సినిమాతో కంగనా..నిజంగా బాలీవుడ్ బాక్సాఫీస్ క్వీన్ అనిపించుకుంటుందా లేదా చూడాలి.
First published: