బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కీరోల్ ప్లే చేస్తున్న మణికర్ణిక మూవీ మొదటిపాట వచ్చేసింది. మై రహు యా నా రహు భారత్ యె రెహనా చాహియే అంటూ... దేశభక్తికి ప్రతిధ్వనించేలా తొలిపాటన మూవీ టీం విడుదల చేసింది. ఈ పాట భారతదేశం గొప్పతనాన్ని, దేశభక్తిని గురించి చాటిచెప్పేలా పాట వినసొంపుగా సాగింది. పాటలో కంగన చిన్నతనం నుంచి పెద్దయ్యే వరకు మొత్తం జీవితం ఎలా గడిచింది. ఆమె ఝాన్సీ లక్ష్మీబాయిలా ఎలా మారింది? అన్నది చూపించారు.
‘భారత్’ పాటను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించారు. శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం పాటను కంపోజ్ చేశారు. క్రిష్ జాగర్లమూడి, కంగన ఈ చిత్రానికి సంయుక్తంగా డైరెక్షన్ చేస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. జనవరి 25న ‘మణికర్ణిక’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయి జీవిత కథ ఆధారంగా ‘మణికర్ణిక’ మూవీని తెరకెక్కించారు. ఝాన్సీ లక్ష్మీ భాయి అసలు పేరు ‘మణికర్ణిక’. ఈ టైటిల్‌తోనే ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్స్‌తో పాటు ఈ మూవీ టీజర్,ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తొలిపాట కూడా విడుదల కావడంతో ... సినిమాపై అభిమానులు ఆసక్తి మరింత రెట్టింపయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Bollywood Movie, Bollywood news, Kangana Ranaut