Jayalalithaa Biopic | ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు. తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రాలో మరో బయోపిక్ తెరకెక్కుతోంది.
ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు. మరెవరూ లేనట్లు పురచ్చితలైవి జీవితాన్నే కథాంశంగా ఎంచుకుని మూడు బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి. తాజాగా ఓ టీవీ సీరియల్ కూడా తెరకెక్కుతోంది. ఇప్పటికే నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో జయలలిత ఐరన్ లేడి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ప్రియదర్శన్ డైరెక్ట్ చేస్తున్నారు. మరోవైపు ఫైజల్ సైఫ్ అనే దర్శకుడు చనిపోయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితంపై ‘‘అమ్మ’’ సిన్మా తీయబోతున్నట్టు ప్రకటించాడు. కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ఇందుల జయలలిత క్యారెక్టర్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసాడు.మరోవైపు ప్రముఖ దర్శకడు భారతీ రాజా కూడా జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించబోెతున్నట్టు ప్రకటించాడు.
తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ‘తలైవి’ అనే పేరు ఖరారు చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘మణికర్ణిక’ వంటి హిస్టారికల్ మూవీ తర్వాత రనౌత్ నటిస్తోన్న బయోపిక్ ఇదే. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు.
తలైవి ఫస్ట్ లుక్
అమ్మగా, పురుచ్చతలైవీగా అభిమానులతో పిలిపించుకున్న జయలలిత తమిళనాడు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను శాసించారు. దాదాపు 14 సంవత్సరాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఇక జయలలిత జీవితంలో ఒక సినిమాకు కావాల్సినంత మసాలా ఉంది. మొత్తానికి వెండితెరపై అమ్మ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
#BigNews: Kangana Ranaut to play Jayalalithaa... Biopic will be made in two languages. Titled #Thalaivi in Tamil and #Jaya in Hindi... Directed by AL Vijay... Written by KV Vijayendra Prasad [#Baahubali and #Manikarnika]... Produced by Vishnu Vardhan Induri and Shaailesh R Singh.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.