• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KANGANA RANAUT TO MEET MAHARASHTRA GOVERNOR BHAGAT SINGH KOSHYARI TA

Kangana Ranaut: మహారాష్ట్ర గవర్నర్‌ను కలవనున్న కంగనా రనౌత్..

Kangana Ranaut: మహారాష్ట్ర గవర్నర్‌ను కలవనున్న కంగనా రనౌత్..

కంగనా రనౌత్ (File/Photo)

Kanagna Ranaut Maharashtra Governor Bhagat Singh Koshyari | కంగనా రనౌత్... ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీతో గత కొన్ని రోజులుగా ఉప్పు నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా కంగనా.. మహారాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు.

  • Share this:
    Kanagna Ranaut Maharashtra Governor Bhagat Singh Koshyari కంగనా రనౌత్... ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీతో గత కొన్ని రోజులుగా ఉప్పు నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే కదా. సుశాంత్ సింగ్  ఆత్మహత్య నేపథ్యంలో ముంబాయి పోలీసులు సరిగా ప్రవర్తించలేదని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్.. కంగనాకు ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే.. మహారాష్ట్రకు రావొద్దంటూ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత కంగనా.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ముంబై మహా నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా తయారైందని వ్యాఖ్యానించింది. కంగనా ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కంగనాకు మహారాష్ట్రలోని అధికార పార్టీకి మధ్య దూరం పెరిగింది. ఆమె ముంబైలో అడుగుపెట్టనీయమని శివసేన బెదరింపులకు దిగింది. అయినా.. ఎవరి బెదిరింపులకు వెరవకుండా కంగనా ముంబైలో లాండ్ అయింది. ఆమెకు వివిధ వ్యక్తులు.. పార్టీల నుంచి థ్రెట్ ఉందని కేంద్రానికి మొరపెట్టుకోవడంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆమెకు  ‘వై’  కేటగిరీ భద్రత కల్పించింది.

    Kangana Ranaut to meet maharashtra governor bhagat singh koshyari,Kangana Ranaut,Kangana Ranaut to meet maharashtra governor bhagat singh koshyari,maharashtra governor bhagat singh koshyari,kangana ranaut drugs scandal,Uddhav Thackeray,Maharashtra Government order to interact kangana ranaut in drugs scandal,kangna ranaut maharastra governement,kangana siva sena,sonia gandhi,kangana sonia gandhi,kangana about sonia gandhi congress,kangana question to sonia gandhi, kangana ranaut news, kangana ranaut twitter, kangana ranaut mumbai, kangana ranaut age, kangana ranaut security, kangana anaut hot, kangana ranaut house, kangana ranaut latest news, kangana ranaut net worth, kangana ranaut instagram, kangana ranaut movies, kangana ranaut cast, kangana ranaut tweet, Kangana Ranaut mumbai tour, Kangana Ranaut in mumbai, Kangana Ranaut news, Kangana Ranaut fb, Kangana Ranaut twitter, Kangana Ranaut comments on mumbai,bollywood news,కంగనా రనౌత్,కంగనా వార్తలు, ముంబై,కంగనా రనౌత్,సోనియా గాంధీ,సోనియా గాంధీ కంగనా రనౌత్,సోనియా గాంధీ,డ్రగ్స్ కేసులో కంగనాపై కేసు నమోదు,భగత్ సింగ్ కోషియారీ,మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోషియారీతో కంగనా రనౌత్ భేటీ,కంనగా రనౌత్,
    మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీతో కంగనా భేటీ (Twitter/Photo)


    ఒకవైపు ఓ ఇష్యూ నడుస్తుండగానే.. కంగనా ఆఫీసు నిబంధనలకు విరుద్ధంగా ఉదంటూ బృహన్ ముంబై కార్పొరేషన్ అందులో కొంత భాగాన్ని కూల్చేసింది. ఇది పెను దుమారానికి దారితీసింది. సీఎం ఠాక్రే మీద రనౌత్ విమర్శల దాడి పెంచారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశిస్తూ ఘాటు ట్వీట్ చేశారు. ముంబైలో జరుగుతున్న దానిపై స్పందించకపోతే చరిత్ర మొత్తం చూస్తోందని అన్నారు. అంతేకాదు డ్రగ్స్‌ కేసులో కంగనా విచారణకు హాజరు కావాలంటూ మహారాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా వరుసగా మహారాష్ట్ర ప్రభుత్వం తనపై దాడి  చేస్తోన్న ఈ ఘటనలపై కంగనా మహారాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఇక కంగనా ఆఫీసును బృహన్ ముంబై పోలీసులు కూల్చవేయడంపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ.. మహారాష్ట్ర ఛీఫ్ సెక్రటరీని వివరణ కోరారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్.. కంగనాను తనను రాజ్‌భవన్‌లో కలవడానికి ఈ రోజు సాయంత్రం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మహా గవర్నర్‌తో కంగనా భేటీ కావడం మహారాష్ట్ర ఇపుడు రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: