Kangana Ranaut As Thalaivi Jayalalithaa : ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. పేరు మోసిన రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, హీరోయిన్ల జీవితాలతో పాటు బీ గ్రేడ్ హీరోయిన్ల జీవితాలను సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలోనే ఒకప్పటి దక్షిణాది అగ్ర కథానాయక, రాజకీయ నాయకురాలు ముఖ్యమంత్రి అయిన సినీ నటి జయలలిత జీవితంపై పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘తలైవి’ సినిమా తెరకెక్కుతోంది. జయలలిత విషయానికొస్తే.. ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు. మరెవరూ లేనట్లు పురచ్చితలైవి జీవితాన్నే కథాంశంగా ఎంచుకుని మూడు బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి.
ఇప్పటికే రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో ‘ది ఐరన్ లేడి’ అనే వెబ్ సిరీస్ కూడా తెరకెక్కింది. గౌతమ్ మీనన్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. మరోవైపు నిత్యామీనన్ ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కుతోంది. జయలలిత జీవితంపై కంగనా హీరోయిన్‌గా ‘తలైవి’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ఖరారు చేసింది.
To Jaya Amma, on her birthanniversary
Witness the story of the legend, #Thalaivi, in cinemas on 23rd April, 2021. @thearvindswami #Vijay @vishinduri @ShaaileshRSingh @BrindaPrasad1 @neeta_lulla #BhushanKumar @KarmaMediaent @TSeries @vibri_media #SprintFilms @ThalaiviTheFilm pic.twitter.com/JOn812GajH
— Kangana Ranaut (@KanganaTeam) February 24, 2021
ఈ సినిమాను ఏప్రిల్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను తమిళంలతో పాటు తెలుగు,హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఏ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కంగనాకు భారీ ఎత్తున పారితోషకం అందుకుంటోంది. ఇప్పటికే జయలలిత గెటప్‌లో ఉన్న కంగనా గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, శోభన్ బాబు పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. మరి ఆ పాత్రలను ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇక సినీ రంగంలో పాటు రాజకీయ రంగంలో జయలలిత గురువు ఎంజీఆర్. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంజీఆర్ ఏఐఏడీఎంకే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు చనిపోయేవరకు సీఎం కుర్చోలనే ఉన్నారు. ఎంజీఆర్ కన్నుమూసిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జయలలిత.. సీఎంగానే కన్నుమూసారు. ఇక ఆమె కన్నుమూయడం కూడా ఓ మిస్టరీనే. మొత్తంగా సినిమాను తలదన్నే స్క్రీన్ ప్లే జయలలిత జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇపుడవన్ని తలైవి సినిమాలో ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind swamy, Bollywood news, Jayalalithaa Biopic, Kangana Ranaut, Kollywood, Thalaivi, Tollywood